పోలవరం ప్రాజెక్ట్‌పై తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్నకోడూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి హాజరైన మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. కాలేశ్వరం ప్రాజెక్టు కంటే ముందు ప్రారంభమైన పోలవరం ఇంతవరకు పూర్తి కాలేదని వ్యాఖ్యానించారు. ఇంకా ఐదేళ్లైన పోలవరం పూర్తి కాదంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అక్కడ ఇంజనీర్లు కలిస్తే అడిగాను ఎప్పుడు పూర్తవుతుందని ఏమో సార్ తెలియదు ఇంకా ఐదేళ్లు పట్టొచ్చు అన్నారని ఆయన తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం పూర్తయి మన పంటలకు నీరు వస్తోందని, అలాంటి కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. తెలంగాణ రాక ముందు ఎలా ఉంది ఇప్పుడూ ఎలా ఉంది అనేది మనకు మనమే సాక్ష్యమని ఆయన అన్నారు.
Also Read : Tirumala Devotee: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. దర్శనానికి 40గంటలు
కాలేశ్వరం ప్రాజెక్టు వల్ల నీళ్లు వస్తున్నాయి చెరువులు కుంటలు నిండి పోతున్నాయని ఆయన అన్నారు. ఢిల్లీలో ఉండి మాట్లాడడం కాదు మా ఊరికి వచ్చి చూడాలి తెలంగాణా ఎలా ఉందో తెలుస్తుందని, కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనను అంటే మన సీఎం కేసీఆర్ ప్రతీ వడ్ల గింజ కోనాలి అని అన్నారన్నారు. తెలంగాణలో ఒక్క ఏకరం అమ్మితే ఆంధ్రలో 10 ఎకరాల భూమి వస్తుందని హరీష్ రావు వ్యాఖ్యానించారు. బీజేపీ నాయకుల మాటలు వట్టి ఝూట మాటలు, టీవీల ముందు ఏదో ఏదో మాట్లాడుతున్నారంటూ హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : Beauty Tips: ముఖంపై మచ్చలు ఇబ్బంది పెడుతున్నాయా ?