Harish Rao: కర్ణాటకలో ఇచ్చిన హామీలు అమలు చేయరు కానీ గెలవని తెలంగాణలో హామీలు ఇస్తున్నారని మంత్రి హరీష్ రావ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ కర్ణాటకలో 5 గ్యారెంటీలు ఇచ్చి 5 నెలలు అయ్యిందని గుర్తు చేశారు. ఎందుకు నెరవేర్చలేదు..? అని హరీష్ రావ్ ప్రశ్నించారు. స్విచ్ వేస్తే వచ్చే కరెంట్ కావాలా? కటిక చీకట్ల కాంగ్రెస్ కావాలా..? అని ప్రశ్నించారు. కర్ణాటకలో ఇచ్చిన హామీలు అమలు చేయరు కానీ గెలవని తెలంగాణలో హామీలు ఇస్తున్నారని మండిపడ్డారు. కర్ణాటకలో బీజేపీ ఉండగా 7 గంటలు, కాంగ్రెస్ 5 గంటల కరెంట్ ఇస్తుందని అన్నారు. 5 గంటలు కావాలంటే కాంగ్రెస్ కు ఓటు వేయాలి, 24 గంటలు కావాలంటే BRS కి ఓటు వేయాలని మంత్రి హరీష్ రావ్ తెలిపారు.
కాంగ్రెస్ అంటే అవినీతికి గ్యారంటీ అని, కాంగ్రెస్ అంటే కుమ్ములాటకు గ్యారంటీ, కాంగ్రెస్ అంటే పేదరికానికి గ్యారంటీ, కాంగ్రెస్ అంటే కరెంట్ కోతలకు గ్యారంటీ, కాంగ్రెస్ అంటే స్కాంలకు గ్యారంటీ, కాంగ్రెస్ అంటే రైతు ఆత్మహత్యలకు గ్యారంటీ, వారంటీ ముగిసిన కాంగ్రెస్ పార్టీ హామీలకు గ్యారంటీ ఎవరు? అని ప్రశ్నించారు. నమ్మి ఓటేసిన కర్ణాటక ప్రజలను కాంగ్రెస్ పార్టీ నట్టేట ముంచిందని తెలిపారు. పుట్టిన బిడ్డ తల్లి దగ్గర ఉంటే ఎంత భద్రంగా ఉంటుందో అని అన్నారు. సాధించుకున్న తెలంగాణ కేసీఆర్ చేతుల్లో ఉంటే అంత భద్రంగా ఉంటుందని మంత్రి అన్నారు. కాంగ్రెస్ పాలనలో ఎట్లుండే తెలంగాణ.. బీఆర్ఎస్ పాలనలో ఎట్లయింది తెలంగాణ అన్నారు. కష్టాల కాంగ్రెస్ మనకొద్దు.. కారు కే ఓటు గుద్దు అని తెలిపారు.
Daggubati Purandeswari: ఇది క్షమించరాని నేరం.. ఫైర్ అయిన పురంధేశ్వరి