Minister Dharmana Prasada Rao: అన్ని రంగాలలో జగన్ మార్పులు తెచ్చారు.. చర్చకు సిద్ధమా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Dharmana Prasada Rao: జగన్ పాలన మిగతా పాలనకు భిన్నమని… అన్ని రంగాలలో జగన్ మార్పులు తెచ్చారని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. మొద్దబ్బాయికి ఏమి తెలుసు.. పాడు చేసేస్తున్నాడు అంటాడని.. రాజధాని పేరు చెప్పి వ్యాపారం చేసుకునే చంద్రబాబుకు పేదవాడి కష్టాలు ఎప్పుడు తెలుస్తాయని ఆయన విమర్శించారు. పనికిమాలిన మాటలను ప్రజలు పట్టించుకోరన్నారు. ముష్టి పరిపాలనలో ఇసుమంత మార్పు తెలీదు.. నువ్వా ఈ పాలనను విమర్శించేది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Balineni Srinivas Reddy: ఈ ఎన్నికల్లోనే నా చివరి పోటీ.. బాలినేని సంచలన వ్యాఖ్యలు
Also Read
- Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
ఈ జిల్లాలో 14 ఏళ్ల పాలనలో నువ్వు తెచ్చిన ఒక్క ప్రాజెక్ట్ చెప్పు అంటూ ఆయన ప్రశ్నించారు. చెవులు లేవు, కళ్ళు లేవు .. రెండింటిలో రెండు బిండలు పెట్టుకున్నావు.. నీకు అభివృద్ధి ఎలా కనిపిస్తుందంటూ చంద్రబాబును ఉద్దేశించి తీవ్రంగా వ్యాఖ్యానించారు. అభివృద్ధిపై చంద్రబాబు కాదు ఎవరు మాట్లాడలేరు.. రమ్మను ఒక వేదికపైకి ఎవరినైనా చర్చకు అంటూ ధర్మాన సవాల్ విసిరారు. చంద్రబాబు నీకు నాలెడ్జ్ లేదు.. నాలెడ్జ్ ఉన్నా ప్రజలను మాయ చేస్తావు అంటూ ఎద్దేవా చేశారు. అభివృద్ధి అంటే ఇవాల్టికి నీకు తెలియకపోవటం మా దురదృష్టమన్నారు. నీ మాటలకు ప్రజల జీవనం మారదన్నారు. జగన్ ఓడిపోతాడు అని అంటున్నారు.. ఎలా ఓడిపోతారని ప్రశ్నించారు. భర్తలను కాదని సగం మంది ఓటర్లుగా ఉన్న ఆడవాళ్లే వైసీపీకి ఓటు వేస్తారన్నారు. నీకు అధికారం ఇస్తే అమరావతి, రియల్ ఎస్టేట్ తప్ప ఇంకేమి చేస్తావంటూ ప్రశ్నించారు. 25 అంతస్తుల భవనం కాదు అభివృద్ధి అంటే… ప్రజల జీవన స్థితిగతుల సూచికను పెంచటమే అభివృద్ధి అని మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!