Imran: ‘మేము బిచ్చగాళ్లం కాదు’.. ఎస్పీ సీట్ల ప్రకటనపై భగ్గుమన్న కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం సమాజ్వాదీ పార్టీ (SP), కాంగ్రెస్ మధ్య జరుగుతున్న సీట్ల పంపకాల చర్చల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. పొత్తులో భాగంగా కాంగ్రెస్కు ప్రాథమికంగా 26 సీట్లు కేటాయిస్తామని ఎస్పీ ఏకపక్షంగా ప్రకటించడంపై కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ బుధవారం తీవ్రంగా మండిపడ్డారు. తాము బిచ్చగాళ్లం కాదని, 26 సీట్లు ఇవ్వమని తాము ఎవరినీ అడగలేదని స్పష్టం చేశారు. ఢిల్లీలో కూటమి సమావేశాలు జరిగిన తర్వాత ఇలా ఏకపక్షంగా సీట్లు ప్రకటించడం పొత్తు ధర్మానికి విరుద్ధమని, ఇది కూటమి పట్ల ఎస్పీకి ఉన్న చిత్తశుద్ధి లోపాన్ని చూపిస్తోందని మసూద్ విమర్శించారు.
బీజేపీని ఓడించడమే ఇండియా (INDIA) కూటమి ప్రధాన లక్ష్యమని, దేశంలో బీజేపీని ఓడించే సత్తా రాహుల్ గాంధీకి మాత్రమే ఉందని అన్నారు. అంతర్గత సమావేశాల్లో చర్చించాల్సిన విషయాలను సోషల్ మీడియాలో బహిరంగంగా ప్రకటించడం సరికాదని ఆక్షేపించారు. తనకు పట్టు ఉన్న సహారన్పూర్ స్థానం నుంచి ఎస్పీ అభ్యర్థిని ప్రకటించడంపై కూడా ఆయన అసహనం వ్యక్తం చేశారు. 2022 ఎన్నికల్లో ఆర్ఎల్డీకి 35 సీట్లు ఇచ్చిన ఎస్పీ, ఇప్పుడు జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్కు కేవలం 26 సీట్లతో మొదలుపెట్టడం ద్వారా ఎలాంటి సందేశం ఇస్తోందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి, కార్యకర్తల అస్తిత్వానికి తాను అండగా ఉంటానని, తదుపరి కార్యాచరణపై పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని మసూద్ తెలిపారు.
Also Read
- CM Revanth Reddy: పౌల్ట్రీ రైతులకు సీఎం రేవంత్ గుడ్న్యూస్.. 48 గంటల్లో కీలక నిర్ణయం!
- Basara IIIT Student S*uicide: బాసర ట్రిపుల్ విద్యార్థి ఆత్మ*హత్యకు అసలు కారణం ఇదే.. కీలక విషయాలు వెల్లడి..!
- Chiranjeevi: 'కాకా' కూడా హిట్ పడితే ఇక చిరునే టాప్?
- Mushroom Pulao Recipe: ప్రోటీన్ ఫుల్, టేస్ట్ సూపర్..! అన్నం ముద్దవ్వకుండా బిర్యానీకి మించిన రుచితో 'మష్రూమ్ పులావ్'..!
ప్రస్తుతం జరుగుతున్న చర్చల్లో కాంగ్రెస్ 120 సీట్లు డిమాండ్ చేస్తుండగా, ఎస్పీ 26 సీట్లను ప్రతిపాదించింది. మరోవైపు, గెలుపు గుర్రాలకే ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ సూచిస్తూ, తొలి విడతగా ఐదుగురు అభ్యర్థులను ప్రకటించారు. అయితే, ఇరు పార్టీల మధ్య పొత్తు ఇంకా చెక్కుచెదరలేదని, నవంబర్ 27న జరగనున్న తదుపరి సమావేశంలో సీట్ల పంపకాలపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. 2024 లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన ఈ రెండు పార్టీలు యూపీలో మంచి ఫలితాలు సాధించిన నేపథ్యంలో, రాబోయే అసెంబ్లీ ఎన్నికల పొత్తు కీలకంగా మారింది.
తాజావార్తలు
-
Imran: ‘మేము బిచ్చగాళ్లం కాదు’.. ఎస్పీ సీట్ల ప్రకటనపై భగ్గుమన్న కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్..
-
Vaibhav Sooryavanshi: 50 బంతుల్లో డబుల్ సెంచరీ చేయొద్దు ప్లీజ్.. న్యూజిలాండ్ కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
CM Revanth Reddy: పౌల్ట్రీ రైతులకు సీఎం రేవంత్ గుడ్న్యూస్.. 48 గంటల్లో కీలక నిర్ణయం!
-
Basara IIIT Student S*uicide: బాసర ట్రిపుల్ విద్యార్థి ఆత్మ*హత్యకు అసలు కారణం ఇదే.. కీలక విషయాలు వెల్లడి..!
-
Ramayana Record: రామాయణ వరల్డ్ రికార్డు.. బాహుబలి 2 రికార్డు బ్రేక్.. నెక్స్ట్ టార్గెట్..?
ట్రెండింగ్
-
Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!
-
Masala Paneer Paratha Recipe: బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే ‘మసాలా పన్నీర్ పరాటా’ ఇలా చేసుకోండి..!
-
Fridge Cleaning Tips : ఫ్రిజ్ హ్యాండిల్ జిగటగా మారుతోందా?.. ఖరీదైన క్లీనర్లు లేకుండానే ఇలా సులభంగా శుభ్రం చేయండి
-
Kitchen Tips : సగం కోసిన ఉల్లిపాయను ఫ్రిజ్లో పెడుతున్నారా?.. ఈ తప్పు చేయొద్దు.!
-
Vaibhav Sooryavanshi: ఆయనతో మాట్లాడిన తర్వాతే ఈ విధ్వంసం సాధ్యమైంది.. 204 పరుగుల సీక్రెట్ బయటపెట్టిన వైభవ్!