Khelo India 2026: ఖేలో ఇండియా-2026 ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.. బ్రోచర్ విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఖేలో ఇండియా-2026 క్రీడా పోటీల ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోటీలకు సంబంధించిన ‘ఖేలో ఇండియా-2026’ బ్రోచర్‌ను ఆయన అధికారికంగా విడుదల చేశారు. డిసెంబర్ 11 నుంచి 22 వరకు జరగనున్న ఈ క్రీడా పోటీల నిర్వహణపై సీఎం అధికారులకు పలు కీలక సూచనలు జారీ చేశారు. డిసెంబర్ 11న ఎల్బీ స్టేడియంలో ప్రారంభోత్సవ వేడుకలను అట్టహాసంగా నిర్వహించాలని, అలాగే డిసెంబర్ 22న గచ్చిబౌలి స్టేడియంలో ముగింపు వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పోటీల సందర్భంగా నగరమంతా క్రీడా స్ఫూర్తి ఉట్టిపడేలా వాతావరణాన్ని తీర్చిదిద్దాలని, ఇందుకోసం పోలీస్, మున్సిపల్ విభాగాల అధికారులు ఎప్పటికప్పుడు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. ఏర్పాట్ల పర్యవేక్షణ కోసం ఒక్కో విభాగానికి ఒక్కొక్కరిని ఇంచార్జులుగా నియమించి జవాబుదారీతనం కల్పించాలని సూచించారు.
జిల్లాల వారీగా పోటీల ఏర్పాట్లను పర్యవేక్షించే బాధ్యతలను మంత్రులకు అప్పగించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఇంచార్జ్ మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబులతో సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లను పర్యవేక్షించాలని క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరికి సూచించారు. అలాగే మహబూబ్ నగర్ పరిధిలో జూపల్లి కృష్ణారావు, వరంగల్‌లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కరీంనగర్లో అడ్లూరి లక్ష్మణ్, ఖమ్మంలో తుమ్మల నాగేశ్వర్ రావు, నిజామాబాద్ పరిధిలో సుదర్శన్ రెడ్డిలకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాలని తెలిపారు.
Also Read
- Imran: ‘మేము బిచ్చగాళ్లం కాదు’.. ఎస్పీ సీట్ల ప్రకటనపై భగ్గుమన్న కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్..
- CM Revanth Reddy: పౌల్ట్రీ రైతులకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్.. 48 గంటల్లో కీలక నిర్ణయం!
- Basara IIIT Student S*uicide: బాసర ట్రిపుల్ విద్యార్థి ఆత్మ*హత్యకు అసలు కారణం ఇదే.. కీలక విషయాలు వెల్లడి..!
- Chiranjeevi: 'కాకా' కూడా హిట్ పడితే ఇక చిరునే టాప్?
క్రీడా పోటీలకు హాజరయ్యే ఆహ్వానితులు, క్రీడాకారులకు అందించే ఆహారం, వసతి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. స్టేడియంల పునరుద్ధరణతో పాటు ఇతర ఏర్పాట్లలో నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని, క్వాలిటీ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. తెలంగాణలో క్రీడలను మరింతగా ప్రోత్సహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, మట్టిలో మాణిక్యాలను వెలికితీసి వారికి మెరుగైన శిక్షణ అందించేందుకు దేశంలోని అత్యుత్తమ కోచ్‌లను నియమించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
తాజావార్తలు
-
Khelo India 2026: ఖేలో ఇండియా-2026 ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.. బ్రోచర్ విడుదల
-
Poojitha Ponnada: AK47లో ఫుల్ లెంగ్త్ రోల్ అని పిలిచి.. సైలెంట్‌గా వేరే హీరోయిన్ను పెట్టేశారు!
-
Tollywood: మన దర్శకులకు ఏమైంది?
-
Imran: ‘మేము బిచ్చగాళ్లం కాదు’.. ఎస్పీ సీట్ల ప్రకటనపై భగ్గుమన్న కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్..
-
Vaibhav Sooryavanshi: 50 బంతుల్లో డబుల్ సెంచరీ చేయొద్దు ప్లీజ్.. న్యూజిలాండ్ కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!
-
Masala Paneer Paratha Recipe: బ్రేక్‌ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే ‘మసాలా పన్నీర్ పరాటా’ ఇలా చేసుకోండి..!
-
Fridge Cleaning Tips : ఫ్రిజ్ హ్యాండిల్ జిగటగా మారుతోందా?.. ఖరీదైన క్లీనర్లు లేకుండానే ఇలా సులభంగా శుభ్రం చేయండి
-
Kitchen Tips : సగం కోసిన ఉల్లిపాయను ఫ్రిజ్‌లో పెడుతున్నారా?.. ఈ తప్పు చేయొద్దు.!
-
Vaibhav Sooryavanshi: ఆయనతో మాట్లాడిన తర్వాతే ఈ విధ్వంసం సాధ్యమైంది.. 204 పరుగుల సీక్రెట్ బయటపెట్టిన వైభవ్!