PM Modi AP Tour: తిరుపతిలో ప్రధాని మోడీ పర్యటన.. మూడు రోజుల పాటు బిజీ షెడ్యూల్, భారీ భద్రతా ఏర్పాట్లు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi’s Tirupati Schedule 2026: ప్రధాని నరేంద్ర మోడీ త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. డిసెంబర్ 4 నుంచి 6 వరకు మూడు రోజుల పాటు తిరుపతిలో ఆయన పర్యటన కొనసాగనుంది. ఏర్పేడు సమీపంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐసర్) వేదికగా నిర్వహించనున్న 61వ అఖిల భారత డీజీపీ, ఐజీపీల సదస్సులో ప్రధాని పాల్గొననున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తోంది.
షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 4వ తేదీ రాత్రి 8.30 గంటలకు ప్రధాని మోడీ రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి ఏర్పేడు ఐసర్ కేంద్రానికి వెళ్లి.. రాత్రి అక్కడే బస చేయనున్నారు. ప్రధానికి స్వాగతం పలికేందుకు గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తిరుపతికి వెళ్లనున్నారు. డిసెంబర్ 4 నుంచి 6 వరకు మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హాజరుకానున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 200 మందికి పైగా ఐపీఎస్ అధికారులు, సుమారు 200 మంది ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు పాల్గొనే అవకాశం ఉంది.
Also Read
- AP Panchayat Elections 2026: రెండో దశ పోలింగ్‌లో ఉద్రిక్తతలు.. నకిలీ బ్యాలెట్ పేపర్లు, రాళ్ల దాడులు!
- MK Stalin: "రాజీపడే ప్రసక్తే లేదు".. రాహుల్ గాంధీ చెన్నై పర్యటనకు ముందు స్టాలిన్ కీలక సందేశం..
- Motorcycle Diaries: రిషబ్ శెట్టి సమర్పించు 'మోటార్ సైకిల్ డైరీస్'..!
- IND vs NZ: ముగిసిన మూడో రోజు ఆట.. భారీ ఆధిక్యం దిశగా న్యూజిలాండ్..!
దేశ అంతర్గత భద్రత, పోలీసు వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లపై ఈ సదస్సులో విస్తృతంగా చర్చించనున్నారు. ముఖ్యంగా సైబర్ నేరాలు, డ్రగ్స్ అక్రమ రవాణా, ఉగ్రవాద ముప్పులు, వ్యవస్థీకృత నేరాల నియంత్రణ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. పోలీసు వ్యవస్థలో కృత్రిమ మేధ (ఏఐ), ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, భద్రతా వ్యవస్థలను మరింత పటిష్టం చేసే మార్గాలపై కూడా చర్చలు జరగనున్నాయి. డిసెంబర్ 5న ఉదయం 8.15 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రధాని మోడీ పోలీసు ఉన్నతాధికారుల సదస్సులో పాల్గొననున్నారు. డిసెంబర్ 6న మధ్యాహ్నం 3.30 గంటల వరకు ఐసర్‌లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉంది.
ప్రధాని పర్యటన నేపథ్యంలో తిరుపతి, ఏర్పేడు ప్రాంతాల్లో అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఐసర్ ప్రాంగణంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా సుమారు రూ.4 కోట్లతో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. ఇందులో భాగంగా 26 ట్రాన్స్ఫార్మర్లు, 47 జనరేటర్లను ఏర్పాటు చేస్తున్నారు. రవాణా, వసతి, పారిశుద్ధ్యం, విద్యుత్ సరఫరా వంటి అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రధాని పర్యటన విజయవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. దేశవ్యాప్తంగా పోలీసు ఉన్నతాధికారులు, కేంద్ర భద్రతా విభాగాల ప్రముఖులు హాజరుకానున్న నేపథ్యంలో తిరుపతిలో భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తున్నారు.
తాజావార్తలు
-
PM Modi AP Tour: తిరుపతిలో ప్రధాని మోడీ పర్యటన.. మూడు రోజుల పాటు బిజీ షెడ్యూల్, భారీ భద్రతా ఏర్పాట్లు!
-
AP Panchayat Elections 2026: రెండో దశ పోలింగ్‌లో ఉద్రిక్తతలు.. నకిలీ బ్యాలెట్ పేపర్లు, రాళ్ల దాడులు!
-
MK Stalin: “రాజీపడే ప్రసక్తే లేదు”.. రాహుల్ గాంధీ చెన్నై పర్యటనకు ముందు స్టాలిన్ కీలక సందేశం..
-
Motorcycle Diaries: రిషబ్ శెట్టి సమర్పించు ‘మోటార్ సైకిల్ డైరీస్’..!
-
Mann Ki Baat 140th Episode: మన్ కీ బాత్.. డ్రగ్స్‌పై పోరాటం, సంచార్ సాథీ, ఫిట్ ఇండియాపై మోడీ కీలక సందేశాలు!
ట్రెండింగ్
-
IND vs NZ: ముగిసిన మూడో రోజు ఆట.. భారీ ఆధిక్యం దిశగా న్యూజిలాండ్..!
-
11,000mAh బ్యాటరీ, 7 అంగుళాల భారీ డిస్ప్లేతో రానున్న Redmi Turbo 6 Max..!
-
Jasprit Bumrah Unwanted Record: 292 బంతుల తర్వాత.. జస్ప్రీత్ బుమ్రా కెరీర్లోనే చెత్త రికార్డు!
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, 50MP పెరిస్కోప్ కెమెరాతో Vivo X500e లాంచ్..!
-
IND vs NZ 2nd Test: రెండో టెస్టులో సిరాజ్‌కు మళ్లీ నిరాశ.. ఆకాష్ దీప్ స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణకు ఛాన్స్!