జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మండిపడ్డారు మంత్రి బొత్స సత్యనారాయణ.. నువ్వు ఏమైనా పెద్ద ఫుడింగువా అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ప్రతి పేదవాడి ఇల్లు ఉండాలని వైఎస్ రాజశేఖరరెడ్డి ఇళ్ళ నిర్మాణం చేశారు. ఆయన తనయుడు జగన్ మరో అడుగు ముందుకు వేసి జగనన్న కాలనీల నిర్మాణం చేపట్టారు. మొదటి క్యాబినెట్ లో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. వివధ దశల వారీగా చేద్దాం అని మేము సూచించాం. కానీ ముఖ్యమంత్రి మాత్రం మంచి పనులకు దేవుడి ఆశీస్సులు ఉంటాయన్నారు. 30 లక్షలకు పైగా ఇళ్ళ స్థలాలు ఇచ్చాం. దీని కోసం 71వేల 800 ఎకరాలను వివిధ రూపాల్లో సేకరించాం అన్నారు మంత్రి బొత్స.
దీనిలో 25 వేల ఎకరాలు కొనుగోలు చేశాం. దీని కోసం 11 వేల కోట్లను ప్రభుత్వం వెచ్చించింది. ఇదే కాకుండా మౌలిక సదుపాయాల కల్పనకు మరో నాలుగు వేల వరకు ఖర్చు పెట్టాం. జనసేన రాజకీయ పార్టీ కాదు… సెలబ్రిటీ పార్టీ. పవన్ కళ్యాణ్ ఈ పథకంలో 15 వేల కోట్ల అవినీతి జరిగిందని అన్నాడు. ఖర్చు పెట్టిందే 15 వేల కోట్ల రూపాయలు అయితే అవినీతికి అవకాశం ఎక్కడ ఉంది?ప్రజలకు ఇళ్ళు ఇవ్వటమే అవినీతి అనా పవన్ కళ్యాణ్ ఉద్దేశమా?నీ పార్ట్‌నర్ చంద్రబాబు ఇళ్ళు ఇవ్వలేదు ఎందుకని ఎప్పుడైనా అడిగావా? అని మంత్రి ప్రశ్నించారు.
నువ్వేమైనా యుగ పురుషుడివా??ఏం మాట్లాడినా ఊరుకుని ఉండటానికి?వ్యాంప్ క్యారెక్టర్లు వేసిన సిల్క్ స్మితా వచ్చినా జనాలు వస్తారు చూడటానికి. ఒక కమెడియన్ వచ్చినా అభిమానులు వస్తారు. పవన్ కళ్యాణ్ ఎవరసలు మేము ఫిర్యాదు చేయటానికి?? నువ్వేమైనా పెద్ద పుడింగు అనుకుంటున్నావా?ఏదో ఊహించుకుంటే ఎలా? జనసేన కార్యకర్తలను లబ్దిదారులు తిప్పి పంపించారు. పవన్ కళ్యాణ్ వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నం చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇప్పటి వరకు వివిధ దశల్లో ఉన్న ఇళ్ళ నిర్మాణం కోసం 7 వేల 700 కోట్లు ఖర్చు అయ్యింది. ఎక్కడ అవినీతి జరిగిందో పవన్ కళ్యాణ్ చెప్పగలడా? అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.
Read Also: Junk Food Survey: పిల్లలు జంక్ ఫుడ్ తినడానికి కారణం ఇదే.. భారతీయ తల్లిదండ్రుల అభిప్రాయం
ప్రజలు ఎవరి చొక్కాలు పెట్టుకుంటున్నారో చూస్తున్నారుగా. పవన్ కళ్యాణ్ టీడీపీతో కాపురం చేస్తూ బీజేపీతో పొత్తు పెట్టుకున్న విషయం జగం ఎరిగిన విషయమే కదా. ఇప్పటికే జనసేన నామినేషన్ వేయకూడదని డిసైడ్ అయిపోయిందన్నమాట. అందుకే మా పార్టీ పై నెపం వేయటానికి సిద్ధం అవుతున్నారు. ఏ క్షణమైనా విశాఖ నుంచి పాలన చేయటానికి ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారు. ప్రధాని బహిరంగ సభ విజయవంతం అయ్యింది. ఏడు నిమిషాల సమయంలోనే ముఖ్యమంత్రి ఉత్తరాంధ్ర భాషను, యాసను, అభివృద్ధి ఆకాంక్షను, రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం అన్న అంశాన్ని స్పష్టంగా చెప్పారన్నారు బొత్స.
Read Also: Junk Food Survey: పిల్లలు జంక్ ఫుడ్ తినడానికి కారణం ఇదే.. భారతీయ తల్లిదండ్రుల అభిప్రాయం