CPS Issue: ‘సీపీఎస్’పై మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు.. అది ముగిసిన అధ్యాయం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CPS Issue: సీపీఎస్ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ.. సీపీఎస్ రద్దు అనే అంశం ముగిసిన అధ్యాయంగా పేర్కొన్న ఆయన.. జీపీఎస్ అనేది మా ప్రభుత్వ విధానం అని స్పష్టం చేశారు.. సీపీఎస్ రద్దు విషయంలో మేం ఇంతకు మించి చేయలేమని.. సీపీఎస్ ఉద్యోగులు అర్థం చేసుకోవాలని మా రిక్వెస్ట్ అని విజ్ఞప్తి చేశారు. జీపీఎస్ విధానం ఉద్యోగులందరికీ ఆమోదయోగ్యంగా ఉందని మేం చెప్పడం లేదు.. కానీ, జీపీఎస్ విధానంలో ఏమైనా చెప్పదల్చుకుంటే మేం చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. అయితే, సీపీఎస్ విధానం రద్దును కేంద్రం ఎందుకు ఆమోదించడం లేదని బీజేపీ వాళ్లని అడగాలని సూచించారు..
Read Also: Mynampally: మైనంపల్లి హనుమంత రావు నివాసంలో కాంగ్రెస్ కార్యర్తల సందడి..
Also Read
- Abhishek Sharma: కోహ్లీ, రోహిత్ కాదు.. ‘అభిషేక్ శర్మను కిడ్నాప్ చేస్తా’.. ఆఫ్ఘనిస్థాన్ ఫ్యాన్ షాకింగ్ కామెంట్..
- Andhra Pradesh: స్థానిక ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. జెడ్పీ, ఎంపీపీలకు ప్రత్యేక అధికారులు..
- Pakistan-Taliban Tensions: పాకిస్తాన్‌కు తాలిబాన్ వార్నింగ్.. ఆఫ్ఘన్‌లోకి అడుగుపెడితే తీవ్ర పరిణామాలే..
- CPM Local Poll Strategy: స్థానిక ఎన్నికల్లో వారితో కలిసి పోటీ..! సీపీఎం కీలక ప్రకటన
కాగా, ఏపీలో సీపీఎస్ విధానాన్ని రద్దుచేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.. సీపీఎస్ స్థానంలో ‘ఏపీ గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ (జీపీఎస్) బిల్లు 2023’ ద్వారా కొత్త విధానాన్ని అమలు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.. ఇక, బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి కొత్తగా వచ్చారు. తాను వచ్చాననే విషయం అందరికీ తెలియాలి కాబట్టే పురంధేశ్వరి మద్యం అంశాన్ని లేవనెత్తారు అంటూ సెటైర్లు వేశారు మంత్రి బొత్స సత్యానారాయణ. మరోవైపు.. స్కిల్ స్కాంలో అధికారుల పాత్ర ఉంటే వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.. మాకేం ప్రేమ్ చంద్రారెడ్డి మీద ప్రత్యేక ప్రేమ లేదన్నారు.. కానీ, అధికారులు అభ్యంతరం చెప్పాక.. ఫైల్ సీఎం దగ్గరకు వెళ్తుంది.. దానికి సీఎందే బాధ్యత అవుతుందన్నారు.. రిమాండ్ కొనసాగింపు సందర్భంగా తానేం తప్పు చేయలేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.. అందుకే ప్రజా జీవితంలో ఉన్న వాళ్లు జాగ్రత్తగా ఉండాలని సూచించారు మంత్రి బొత్స సత్యనారాయణ.
తాజావార్తలు
-
Gondhal Oscars 2027: రూ.84 లక్షలే వసూలు చేసిన ‘గోంధల్’.. రూ.3000 కోట్ల ‘ధురంధర్’ను దాటి ఆస్కార్ రేసులోకి ఎలా వెళ్లిందంటే?
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Abhishek Sharma: కోహ్లీ, రోహిత్ కాదు.. ‘అభిషేక్ శర్మను కిడ్నాప్ చేస్తా’.. ఆఫ్ఘనిస్థాన్ ఫ్యాన్ షాకింగ్ కామెంట్..
-
Andhra Pradesh: స్థానిక ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. జెడ్పీ, ఎంపీపీలకు ప్రత్యేక అధికారులు..
-
Ashwagandha: ఆయుర్వేద మందు వాడింది.. తర్వాత బ్రెయిన్ డ్యామేజ్.. అసలేం జరిగింది?
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!