Vigilance Raids: అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌పై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం.. రూ. 10.43 కోట్ల సరుకు స్వాధీనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల ధరలు, నిల్వలు, సరఫరాపై విజిలెన్స్ శాఖ ప్రత్యేక నిఘా పెట్టింది. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, విజిలెన్స్ డీజీ హరీష్ కుమార్ గుప్తా పర్యవేక్షణలో అక్టోబర్ 26 నుంచి రాష్ట్రవ్యాప్తంగా విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. సామాన్య ప్రజలకు నిత్యావసర వస్తువులు సరసమైన ధరలకు అందేలా చూడటమే లక్ష్యంగా సివిల్ సప్లైస్, జీఎస్టీ, ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ, రెవెన్యూ , పోలీస్ శాఖల సమన్వయంతో ఈ దాడులు జరుగుతున్నాయి.
ఇప్పటివరకు మొత్తం 294 తనిఖీ బృందాలు రంగంలోకి దిగి 248 మార్కెట్లు, వివిధ ప్రాంతాలను పరిశీలించాయి. ఇందులో భాగంగా 714 హోల్‌సేల్ వ్యాపార సంస్థలు, 17 రైస్ మిల్లులు, 13 గోదాములు, 144 రిటైల్ దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులపై ఇప్పటివరకు 516 కేసులు నమోదు చేశారు. అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించిన అధికారులు ధరల అసాధారణ పెరుగుదలకు సంబంధించి ఒకటి, కృత్రిమ కొరత సృష్టించినందుకు ఒకటి, అక్రమ నిల్వలు , మళ్లింపులకు సంబంధించి మూడు ఘటనలను గుర్తించారు.
Also Read
- SP-Congress Alliance: 200కు పైగా సీట్లు కోరుతున్న కాంగ్రెస్.. నవంబర్ 17న అఖిలేశ్‌తో కీలక భేటీ!
- Kishtwar SPO Killings: ‘‘మసీదు నుంచి బెదిరింపులు, ఇద్దరు పోలీసుల హత్య’’ బీజేపీ ఎమ్మెల్యే ఆరోపణలు..
- Ukraine Peace Deal: డాన్బాస్ కావాలా.. NATO సభ్యత్వమా? ఉక్రెయిన్ ముందు అమెరికా ప్రతిపాదన!
- Microsoft Outage: 36 గంటల తర్వాత గాడినపడ్డ మైక్రోసాఫ్ట్ సేవలు.. గంటకు మిలియన్ల నష్టం!
ఈ దాడులలో భాగంగా అధికారులు రూ.10,43,10,528 విలువైన అక్రమ సరుకులను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 159.204 టన్నుల బియ్యం, 2,017.755 మెట్రిక్ టన్నుల బియ్యం ధాన్యం, 831.45 కిలోల పప్పులు, 1,930 లీటర్ల వంట నూనె, 9.3 మెట్రిక్ టన్నుల రసాయన ఎరువులు, అక్రమ రవాణాకు సంబంధించిన మరో 1,050 కిలోల సరుకులు ఉన్నాయి. నిత్యావసర వస్తువులను అధిక ధరలకు విక్రయించినా, అక్రమంగా నిల్వ ఉంచి కృత్రిమ కొరత సృష్టించినా సహించేది లేదని, అలాంటి అక్రమాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్ (PD Act) కింద కఠిన చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ డీజీ హరీష్ కుమార్ గుప్తా హెచ్చరించారు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-1 Live: కైలాసాన్ని తలపించే వేదిక.. కోటి దీపోత్సవంలో తొలిరోజు విశేషాలివే.!
-
Vigilance Raids: అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌పై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం.. రూ. 10.43 కోట్ల సరుకు స్వాధీనం..
-
SP-Congress Alliance: 200కు పైగా సీట్లు కోరుతున్న కాంగ్రెస్.. నవంబర్ 17న అఖిలేశ్‌తో కీలక భేటీ!
-
Mississippi River Accident : మిసిసిపీ నదిలో పెను ప్రమాదం.. క్రూయిజ్ షిప్‌ను ఢీకొట్టిన ట్యాంకర్
-
Kishtwar SPO Killings: ‘‘మసీదు నుంచి బెదిరింపులు, ఇద్దరు పోలీసుల హత్య’’ బీజేపీ ఎమ్మెల్యే ఆరోపణలు..
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!