Site icon NTV Telugu

Atchannaidu: అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లించాల్సిన మొత్తం భూమి రూపంలో…

Kinjarapu Atchannaidu

Kinjarapu Atchannaidu

వైసీపీ హయాంలో తప్పు చేసిన వారిని శిక్షించేందుకు ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. “వైసీపీ పెట్టిన అక్రమ కేసుల్ని నిర్ణీత కాలపరిమితిలో ఎత్తివేసేలా చూడాలని నిర్ణయించాం. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగేలా వారికి చెల్లించాల్సిన మొత్తం భూమి రూపంలో ఇచ్చేలా ఆలోచన చేస్తున్నాం. స్థానిక సంస్థల్లో బీసీలకు తగ్గిన 10శాతం రిజర్వేషన్ కోటా పునరుద్ధరణ కు చట్టపరమైన అంశాలు పరిశీలిస్తున్నాం. జూన్ లోగా మరో 3హామీలు అమల్లోకి తెస్తున్నాం. తల్లికి వందనం నిధులు విడుదల చేసి విద్యా సంవత్సరం ప్రారంభిస్తాం. రైతులకు అన్నదాత సుఖీభవ, మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో 20వేలు ఇస్తాం. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ హామీపై పొలిట్ బ్యూరో లో చర్చించాం. ప్రతీ హామీ నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని నిర్ణయించాం.” అని మంత్రి తెలిపారు.

READ MORE: Hamas-Israel: రేపు మరో ముగ్గురు బందీలను విడుదల చేస్తున్నట్లు హమాస్ ప్రకటన

ఇప్పటికే 60శాతం హామీలు నెరవేర్చామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. “గత 7నెలలోనే ఎవ్వరూ ఊహించని పథకాలు ప్రవేశపెట్టడం పై పొలిట్ బ్యూరో హర్షం వ్యక్తం చేసింది. కార్యకర్తల పెండింగ్ బిల్లుల్ని ప్రాధాన్యతగా తీసుకుని చెల్లింపులు చేయాలని నిర్ణయించాం. ఈసారి మహానాడు కడప జిల్లాలో నిర్వహిస్తాం. మే 27, 28తేదీల్లో మహానాడు తీర్మానాలు, 29న భారీ బహిరంగ నిర్వహిస్తాం. మహానాడులో జాతీయ పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు ని ఎన్నుకుంటాం. ఇకపై పార్టీ కార్యాలయంలో ప్రజాదర్బార్ కు ప్రతీ శనివారం మంత్రులు హాజరవుతారు. సాధికార కమిటీ సభ్యుడైతేనే పార్టీ పదవుల్లో ఉండేలా నిర్ణయం తీసుకున్నాం. జూన్ లోగా అన్ని నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తాం.” అని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

Exit mobile version