Site icon NTV Telugu

Minister Atchannaidu: జనవరి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం

Atchannaidu

Atchannaidu

Minister Atchannaidu: గతంలో 117 జీఓ తెచ్చి విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేశారని.. 117 జీఓను రద్దు చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.జనవరి నుండి ఇంటర్మీడియట్ విద్యలో మధ్యాహ్న భోజనం పథకాన్ని ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. విద్యా కిట్లు ఇస్తున్నామని ఆయన వెల్లడించారు. మూలపేట పోర్టులో శరవేగంగా పనులు జరుగుతున్నాయని.. జూన్ నాటికి మొదటి షిప్ రావడానికి ప్రయత్నం చేస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. 5 వేల ఎకరాల సాల్ట్ ల్యాండ్ తీసుకుంటామని చెప్పారు.

Read Also: Sandhya Theatre Stampede: : ఇకపై నో బెనిఫిట్ షోలు.. టీ సర్కార్ షాకింగ్ నిర్ణయం

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. గత ఐదేళ్లు రైతులను మభ్యపెట్టారని.. గతంలో మాదిరిగానే వైసీపీ అబద్ధాలు చెబుతోందన్నారు. ఐదేళ్లలో వ్యవస్థలు నిర్వీర్యం చేశారని.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిందని విమర్శించారు. చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఐదేళ్లలో లక్ష కోట్లు అప్పు చేశారన్నారు. కేంద్రం ఇచ్చిన పథకాలు కూడా వైసీపీ వినియోగించలేదన్నారు. గత ప్రభుత్వం 1600 కోట్ల రూపాయలు రైతులకు బకాయిలు పెట్టిందన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన నాలుగు గంటల్లోనే రైతులకు డబ్బులు చెల్లిస్తున్నామన్నారు. నేటి వరకు 21 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి మూడు లక్షల ఇరవై వేల మంది రైతులకు సొమ్మును ఖాతాలో జమ చేశామన్నారు. యాంత్రీకరణకు అధిక ప్రాధాన్యత ఇస్తూ 24 శాతం ఉన్న తేమను 14 శాతానికి తగ్గించామన్నారు. రాష్ట్రంలో రూ.4,600 కోట్లతో రోడ్లను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. నాడు-నేడు పనులపై విచారణకు ఆదేశిస్తామని ఆయన వెల్లడించారు.

Exit mobile version