Minister Atchannaidu: జనవరి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం
- జనవరి నుండి ఇంటర్మీడియట్ విద్యలో మధ్యాహ్న భోజనం
- నాడు-నేడు పనులపై విచారణకు ఆదేశిస్తాం
- మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Atchannaidu: గతంలో 117 జీఓ తెచ్చి విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేశారని.. 117 జీఓను రద్దు చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.జనవరి నుండి ఇంటర్మీడియట్ విద్యలో మధ్యాహ్న భోజనం పథకాన్ని ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. విద్యా కిట్లు ఇస్తున్నామని ఆయన వెల్లడించారు. మూలపేట పోర్టులో శరవేగంగా పనులు జరుగుతున్నాయని.. జూన్ నాటికి మొదటి షిప్ రావడానికి ప్రయత్నం చేస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. 5 వేల ఎకరాల సాల్ట్ ల్యాండ్ తీసుకుంటామని చెప్పారు.
Read Also: Sandhya Theatre Stampede: : ఇకపై నో బెనిఫిట్ షోలు.. టీ సర్కార్ షాకింగ్ నిర్ణయం
Also Read
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. గత ఐదేళ్లు రైతులను మభ్యపెట్టారని.. గతంలో మాదిరిగానే వైసీపీ అబద్ధాలు చెబుతోందన్నారు. ఐదేళ్లలో వ్యవస్థలు నిర్వీర్యం చేశారని.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిందని విమర్శించారు. చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఐదేళ్లలో లక్ష కోట్లు అప్పు చేశారన్నారు. కేంద్రం ఇచ్చిన పథకాలు కూడా వైసీపీ వినియోగించలేదన్నారు. గత ప్రభుత్వం 1600 కోట్ల రూపాయలు రైతులకు బకాయిలు పెట్టిందన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన నాలుగు గంటల్లోనే రైతులకు డబ్బులు చెల్లిస్తున్నామన్నారు. నేటి వరకు 21 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి మూడు లక్షల ఇరవై వేల మంది రైతులకు సొమ్మును ఖాతాలో జమ చేశామన్నారు. యాంత్రీకరణకు అధిక ప్రాధాన్యత ఇస్తూ 24 శాతం ఉన్న తేమను 14 శాతానికి తగ్గించామన్నారు. రాష్ట్రంలో రూ.4,600 కోట్లతో రోడ్లను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. నాడు-నేడు పనులపై విచారణకు ఆదేశిస్తామని ఆయన వెల్లడించారు.
తాజావార్తలు
-
US Airstrike on Iran: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రం.. 24 గంటల్లో రెండోసారి ఇరాన్‌పై అమెరికా వైమానిక దాడి
-
Astrology: సమస్యలు వచ్చినా భయపడని 4 రాశులు వీరేనా? ఎంత కష్టమైనా ధైర్యంగా ఎదుర్కొంటారట!
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్‌తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!