NTV Telugu Site icon

Ambati Rambabu: పవన్‌ రాజకీయాలకు పనికొచ్చే మనిషి కాదు.. అంబటి సంచలన వ్యాఖ్యలు

Ambati Rambabu

Ambati Rambabu

Ambati Rambabu: జనసేన – టీడీపీ ఒప్పందం అయిన తర్వాత జరిగిన మొదటి ఉమ్మడి సభ తాడేపల్లిగూడెం జెండా సభ అని.. తాడేపల్లిగూడెం సభతో అసలు ఏం సందేశం ఇచ్చారని.. జెండా సభకు జనాలు రాకపోవటంతో ఆలస్యంగా మొదలుపెట్టారని ప్రతిపక్ష కూటమిని ఉద్దేశించి మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. సభకు సాయంత్రం 6:00 వరకు జనం రాలేదన్నారు. బాలకృష్ణ చంద్రబాబు పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అని పొగిడారే తప్ప.. జనసేన కార్యకర్తలు ఎదురుచూసినట్లు పవర్ షేరింగ్ గురించి మాత్రం మాట్లాడలేదన్నారు. జనసేన కార్యకర్తలు చెవిలో పూలు పెట్టుకున్నట్టు చంద్రబాబు మాట్లాడారని ఆయన వ్యాఖ్యానించారు.

Read Also: MP Mithun Reddy: ఎంపీగా ఇవే నా చివరి ఎన్నికలు!.. ఎంపీ మిథున్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

పొత్తు నాకోసం కాదు ప్రజల కోసం అన్నట్టు చంద్రబాబు మాట్లాడారని.. అధికారం తనకు తప్ప మిగిలిన వారికి షేర్ చేయనన్న అంశం చంద్రబాబు తన బాడి లాంగ్వేజ్‌లోనే వివరించారన్నారు. అగ్నికి వాయువు తోడైందని చంద్రబాబు చెప్పారంటే.. రాష్ట్రం నాశనమైనట్టు అర్థమన్నారు. అసలు పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికి వస్తాడా అంటూ అంబటి పేర్కొన్నారు. మాట తీరు అత్యంత దారుణంగా ఉందన్నారు. “పవన్‌ రాజకీయాలకు పనికొచ్చే మనిషి కాదు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. పవన్‌ను నమ్ముకున్న అమాయకుల పరిస్థితి ఏంటి..? పవన్‌ను నమ్ముకుంటే కుక్క తోకపట్టుకుని గోదావరి ఈదినట్టే..” అని అంబటి రాంబాబు అన్నారు. ఎవరు రాసిన డైలాగులు పవన్ కళ్యాణ్ మాట్లాడాడో ఎవరికి అర్థం కావటం లేదు… కనీసం జనసేన కార్యకర్తలకు కూడా అర్థం కావటం లేదన్నారు. అధ్వానంగా ఉన్న పార్టీకి 24 సీట్లు ఇవ్వటమే గొప్ప అన్నట్టు పవన్ కళ్యాణ్ మాట్లాడాడన్నారు.

Read Also: Bollineni Ramarao: ఆఖరి ప్రయత్నంగా చంద్రబాబుని కలుస్తా.. ఆవేదనను బాబు ముందు ఉంచుతా: బొల్లినేని రామారావు

సీఎం జగన్‌ను తొక్కేస్తానంటూ పిచ్చి మాటలు మాట్లాడాడని… లేకుంటే తన పేరు పవన్‌ కల్యాణే కాదని అన్నాడని అంబటి రాంబాబు అన్నారు. అవును.. ఆయన పేరు పవన్‌ కల్యాణ్‌ కాదన్నారు. జగన్‌ను అధఃపాతాళానికి తొక్కాలంటే.. పవన్‌ను పుట్టించిన వాళ్లు రావాలన్నారు. ఏది అనుకున్నాడో దాని గురించి నిలబడే నాయకుడు వైఎస్‌ జగన్‌ అని… అలాంటిది సీఎం జగన్‌ గురించి మాట్లాడే నైతిక హక్కు పవన్‌కు లేదన్నారు. జనసైనికులను అడిగితే పవన్‌ గొప్పో.. జగన్‌ గొప్పో చెబుతారన్నారు.  మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ..” పవన్ కళ్యాణ్ నాలుగో పెళ్ళాం నాదెండ్ల మనోహరే. చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్‌కు మొగుడు జగన్మోహన్ రెడ్డి.  పిల్లిని సంకన పెట్టుకుని వెళ్లకూడదనే లోకేష్‌ను సభకు రానివ్వలేదు. చంద్రబాబు అన్ని తెలిసినవాడు కావడం వల్లే లోకేష్‌ను సభకు వద్దన్నారు. లోకేష్ టీడీపీకి శకునం. లోకేష్ వచ్చిన తర్వాతే టీడీపీ ప్లాఫ్ అయిపోయింది.” అని  మంత్రి అంబటి రాంబాబు అన్నారు.