భవానిపురంలోని ఏపీ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ లో గో ఎలక్ట్రిక్ క్యాంపెయిన్ కార్యక్రమం ప్రారంభమయింది. క్యాంపెయిన్ లో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రారంభించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. సోలార్ ఎనర్జీతో పనిచేసే ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాసరావు ,మల్లాది విష్ణు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో ఎలక్ట్రానిక్ వాహనాలకి ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేశాం అన్నారు. తిరుపతిలో ప్రస్తుతం 100 ఎలక్ట్రానిక్ బస్సులు ఉన్నాయి. 1000 బస్సులు తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు పోతాం అన్నారు.
Read Also: Crime News: ఛీఛీ.. కామ పిశాచులు.. పాతిపెట్టిన శవంపై గ్యాంగ్ రేప్.. చివరికి
రాబోయే రోజుల్లో ఎలక్ట్రికల్ వాహనాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నదే సిఎం జగన్ ఆలోచన అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో ఈ స్టేషన్స్ ఏర్పాటు చేస్తాం అన్నారు. విద్యార్థుల కోసం డిజిటల్ టెక్నాలజీ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ స్థలం కోర్ట్ కేసులో ఉన్నందున పిల్లలకు గ్రౌండ్ ఆలస్యం అవుతుందన్నారు.
Read Also: Crime News: ఛీఛీ.. కామ పిశాచులు.. పాతిపెట్టిన శవంపై గ్యాంగ్ రేప్.. చివరికి