OnePlus Nord CE5: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ కోర్ ఎడిషన్ సిరీస్‌లో తాజా మోడల్ వన్ ప్లస్ నార్డ్ CE5 ను భారత మార్కెట్‌లో అధికారికంగా విడుదల చేసింది. ఈ మొబైల్ జూలై 12 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ ఆకట్టుకునే ఫీచర్లు, శక్తివంతమైన హార్డ్వేర్, దీర్ఘకాలిక బ్యాటరీతో వినియోగదారులను ఆకర్షించనుంది. మరి ఆ వివరాలేంటో ఒకసారి చూద్దామా..
OnePlus Nord CE5 లో 6.77 అంగుళాల FHD+ 120Hz AMOLED డిస్‌ప్లే ఉంది. దీని పీక్ బ్రైట్నెస్ 1430 నిట్స్ వరకు ఉంటుంది. దీనిలో Dimensity 8350 Apex 4nm ప్రాసెసర్ ను ఉపయోగించారు. గేమింగ్ ప్రియుల కోసం ఇందులో CryoVelocity VC కూలింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయబడింది. ఇక ఇందులో కెమెరా సెటప్ విషయానికి వస్తే ఇందులో.. 50MP Sony LYT-600 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ లెన్స్ ఉన్నాయి. ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరా తో ఫుల్ HD 60fps వరకు వీడియో రికార్డింగ్ కి మద్దతు ఉంది. వెనుక కెమెరా 4K 60fps వరకు వీడియో తీసే సామర్థ్యం కలిగి ఉంది.
Read Also:WAR 2 : వార్ 2 US ప్రీమియర్స్.. యంగ్ టైగర్ ఊచకోత చూస్తారు
వన్ ప్లస్ నార్డ్ CE5 ఫోన్‌కు 7100mAh భారీ బ్యాటరీ కలదు. దీనికి 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. దీనితో పాటు బైపాస్ చార్జింగ్ ఫీచర్ కూడా ఉంది. ఫోన్ ఆండ్రాయిడ్15, ఆక్సిజన్ OS 15 పై రన్ అవుతుంది. వన్‌ప్లస్ ఈ ఫోన్‌కు 4 ఆండ్రాయిడ్ అప్డేట్లు, 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్లు అందించనున్నట్టు వెల్లడించింది. ఇక ఇతర ఫీచర్లు చూస్తే ఇందులో 5G (SA/NSA), డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 6, Bluetooth 5.4, NFC, In-display ఫింగర్‌ప్రింట్, Infrared సెన్సార్, USB Type-C ఆడియో, బాటమ్ స్పీకర్ లు ఉన్నాయి.
బ్లాక్ ఇన్ఫినిటీ, మార్బల్ మిస్ట్, నెక్సస్ బ్లూ అనే 3 రంగులలో ఈ మొబైల్ విడుదల కానుంది. ఈ మొబైల్ బరువు 199 గ్రాములు. ఇక ధరల విషయానికి వస్తే.. బేసిక్ వేరియంట్ అయిన 8GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 24,999గా నిర్ణయించబడింది. మధ్య వేరియంట్ 8GB RAM + 256GB స్టోరేజ్ ధర రూ. 26,999గా ఉంది. హైఎండ్ వేరియంట్ అయిన 12GB RAM + 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 28,999గా ఉండబోతోంది. ఈ ఫోన్ జూలై 12 నుండి అమెజాన్, వన్ ప్లస్ అధికారిక వెబ్‌సైట్, వన్ ప్లస్ స్టోర్ యాప్, అలాగే రిలయన్స్ డిజిటల్, క్రోమా, విజయ్ సేల్స్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వంటి ప్రధాన రిటైల్ స్టోర్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.
Read Also:Bandi Sanjay Kumar: కేంద్రమంత్రి బండి సంజయ్ పుట్టినరోజు కానుకగా 20 వేల సైకిళ్ల పంపిణీ..!
ఇక లాంచ్ ఆఫర్ల కింద ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై రూ. 2,000 తక్షణ డిస్కౌంట్ లభించనుంది. అలాగే 6 నెలల వరకు No Cost EMI వసతి కూడా ఉంది. అలాగే అప్రూవ్డ్ కస్టమర్లకు ఎటువంటి డౌన్‌పేమెంట్ లేకపోవడంతో 9 నెలల No Cost EMI (ఇన్-స్టోర్ ఫైనాన్స్ ద్వారా) ఇవ్వబడుతుంది. మొత్తంగా.. గేమింగ్, భారీ యూజ్, లాంగ్ లైఫ్ బ్యాటరీ కోరుకునే వినియోగదారులకు OnePlus Nord CE5 ప్రీమియం లక్షణాలతో కూడిన మొబైల్ అవుతుంది.