కర్ణాటక ప్రజలు ప్రస్తుతం ద్రవ్యోల్బణంతో చాలా సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర సర్కార్ పాల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1 నుంచి లీటరుకు రూ. 4 పెంచుతున్నట్లు మంత్రి కె.ఎన్. రాజన్న గురువారం ప్రకటించారు. పాల సంఘాలు, రైతుల ఒత్తిడి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి తెలిపారు. కాగా.. కర్ణాటకలో పాల ధర పెరగడం ఇది మూడోసారి. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (KMF) నందిని బ్రాండ్ పాలు, వాటి ఉత్పత్తులపై రూ. 5 పెంచాలంటూ డిమాండ్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర సర్కార్ రూ. 4 పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
Read Also: SRH vs LSG: టాస్ గెలిచిన లక్నో.. సన్‌రైజర్స్ బ్యాటింగ్
కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (KMF) చైర్మన్ భీమా నాయక్ పాల ధర పెరుగుదలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ, “రాష్ట్రంలో ప్రస్తుతం అమ్ముతున్న పాలు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తక్కువ ధరకు ఉన్నాయి. గుజరాత్‌లో 1 లీటరు పాలు రూ. 53, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో రూ. 58, ఢిల్లీ, మహారాష్ట్రలో రూ. 56, కేరళలో రూ. 54 ధర ఉన్నాయి. కర్ణాటకలో లీటరు పాలు రూ. 42కి అమ్ముతున్నారు.” అని అన్నారు. ఈ ధర పెరుగుదల నిర్ణయం రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకున్నట్లు భీమా నాయక్ తెలిపారు. పాల ఉత్పత్తి చేసే రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అందువల్ల.. రైతులకు మరింత లాభం అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. పెరిగిన రూ. 4 మొత్తం రైతులకు మాత్రమే వెళ్ళిపోతుంది” అని ఆయన స్పష్టం చేశారు.
Read Also: Health Tips: డయాబెటిస్ రోగులకు ఈ పండ్లు.. మందుల కంటే ఎక్కువ మేలు చేస్తాయి తెలుసా?
గత సంవత్సరం కూడా కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ పాల ధరను ప్యాకెట్‌కు 2 రూపాయలు పెంచింది. అలాగే ప్యాకెట్ పరిమాణాన్ని 50 ml పెంచింది. 1,050 మి.లీ. సాధారణ నందిని టోన్డ్ పాలు ధర రూ. 42గా ఉంది. పెరిగిన ధరతో రూ.46 కానుంది.