Petrol, Diesel Prices: మధ్యప్రాచ్యంలో యుద్ధం ఎఫెక్ట్ ప్రపంచమంతా కనిపిస్తోంది. భారత్‌పై మిడిల్ ఈస్ట్ యుద్ధ ప్రభావం పడింది. ఇప్పటికే భారత్‌లోని ప్రధాన నగరాల్లో ఎల్పీజీ సంక్షోభం పెరిగిపోయింది. ఇక పెట్రోల్, డీజిల్ ధరలపై సామాన్యులు భయపడుతున్నారు. ఈ ధరలు రానున్న కొన్ని రోజుల్లో విపరీతంగా పెరుగుతాయనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా స్పందించింది. పెట్రోల్, డీజిల్ ధరలపై క్లారిటీ ఇచ్చింది. ఈ ధరపై ప్రస్తుతం ప్రభావం ఉండబోదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దేశీయంగా చమురు ధరలను స్థిరంగా ఉంచేందుకు ఇప్పటికే ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇధనం ఇంధన సరఫరాలోనూ ఎలాంటి ఆటంకాలు కలగకుండా ‘ఫ్యూయల్ సప్లై మేనేజ్మెంట్ చైన్’ ప్రోగ్రామ్‌ను ప్రభుత్వం ఇప్పటికే యాక్టివేట్ చేసినట్లు ఓ జాతీయ మీడియా సంస్థ కథనం వెల్లడించింది. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన ‘స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్’ (Strait of Hormuz) మార్గంలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్న నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది.
READ MORE: Surya Midha: కాలేజ్ డ్రాపౌట్ నుంచి బిలియనీర్ వరకు.. 22 ఏళ్లలోనే బిలియనీర్ క్లబ్‌లోకి సూర్య మిధా
వాస్తవానికి గతంలో ‘స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్’ మార్గం గుండా భారత్ 40శాతం చమురును దిగుమితి చేసుకునేది. ఈ మిడిల్ ఈస్ట్ దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు భారత్ వ్యూహాన్ని రూపొందించింది. హార్ముజ్ మార్గం కాకుండా ఇతర ప్రాంతాల నుంచి చమురు దిగుమతులను 60 శాతం నుంచి 70 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం దాదాపు 40 దేశాల నుంచి భారత్ చమురును సేకరిస్తోంది. ఈ కొత్త మార్గం ద్వారా చమురు దిగుమతి చేసుకోవడంతో ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ సంక్షోభం లేదని తెలుస్తోంది. కానీ.. భవిష్యత్తులో యుద్ధం ఇంకా ముదిరితే మాత్రం భారత్‌పై ఎఫెక్ట్ పెద్ద ఎత్తున ఉండబోతోందనే వాదనలూ వినిపిస్తున్నాయి. ఇక ఎల్పీజీ (LPG) విషయంలో కేంద్రం జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే బ్లాక్ మార్కెట్‌ను అరికట్టేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఇటీవల జరిగిన గ్యాస్ ధరలు చాలా స్వల్పమని, ఇక మీద భారీ ధరల పెంపు ఏమీ ఉండబోదని ప్రభుత్వం వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఎక్కడా గ్యాస్ కొరత లేదని, ప్రజల అవసరాలకు సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.