ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఖాతాలో మరో పెద్ద సంస్థ చేరింది. ప్రాసెస్ మైనింగ్ టెక్నాలజీలో అగ్రగామి సంస్థగా ఉన్న మినిట్‌ను భారీ మొత్తానికి కొనుగోలు చేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. అయితే ఎంత మొత్తానికి కొనుగోలు చేసిన విషయం మాత్రం మైక్రోసాఫ్ట్ వెల్లడించలేదు. కాగా మినిట్ సంస్థ బిజినెస్ వ్యవహారాల్లో ఆపరేషన్స్ నిర్వహణలో మెరుగైన కార్యాచరణ సామర్థ్యం కోసం అవకాశాలను వెలికితీయడంలో ప్రసిద్ధి చెందింది. వ్యాపార ప్రక్రియ పూర్తి చిత్రాన్ని రూపొందించడం ద్వారా డిజిటల్‌గా రూపాంతరం చెందడానికి,…