MI vs LSG: ముంబైలోని వాంఖడే స్టేడియంలో నేడు జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (MI) లక్నో సూపర్ జెయింట్స్ (LSG) ను 54 పరుగుల తేడాతో ఓడించింది. 216 పరుగుల భారీ టార్గెట్‌ను ఛేదించేందుకు వచ్చిన లక్నో సూపర్ జెయింట్స్ కేవలం 161 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీనితో ముంబై ఇండియన్స్ 54 పరుగుల భారీ విజయం సాధించింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 215/7 పరుగులు సాధించింది. ర్యాన్ రికెల్టన్ 32 బంతుల్లో 58 పరుగులతో, సూర్యకుమార్ యాదవ్ 28 బంతుల్లో 54 పరుగులు, విల్ జాక్స్ 21 బంతుల్లో 29 పరుగులతో సత్తా చాటారు. అయితే, రోహిత్ శర్మ (12), తిలక్ వర్మ (6), హార్దిక్ పాండ్యా (5), కార్బిన్ బాష్ (20) లు త్వరగా ఔట్ అయ్యారు. అయితే, చివరిలో నమన్ ధీర్ 11 బంతుల్లో 25 పరుగులతో జట్టుకు భారీ స్కోరు అందించాడు. ఇక లక్నో బౌలర్లలో మయాంక్ యాదవ్, అవేశ్ ఖాన్ 2 వికెట్లు తీసుకోగా.. ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ రాథీ, రవి బిష్ణోయ్ చెరో వికెట్ సాధించారు. అయితే, ముంబై ఇండియన్స్ చేసిన భారీ స్కోరును ఛేదించడం లక్నో జట్టుకు కష్టమైంది.
ఇక ఛేదించడానికి వచ్చిన లక్నో సూపర్ జెయింట్స్ కేవలం 161 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. మొదటి నుంచి లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లను కష్టంలో పెట్టిన ముంబై బౌలింగ్ యూనిట్.. మొత్తానికి విజయం సాధించింది. ఇక లక్నో బ్యాటింగ్ ఇన్నింగ్స్ లో మిచెల్ మార్ష్ (34), అయ్యుష్ బడోని (35), నికోలస్ పూరన్ (27) లు మాత్రమే పరుగులు సాధించారు. మిగితావారు పెద్దగా ప్రభావితం చూపించలేకపోయారు. ఇక ముంబై ఇండియన్స్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 3 వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా 4 వికెట్లు తీసి జట్టును విజయమార్గంలో నడిపించారు. మొత్తంగా లక్నో సూపర్ జెయింట్స్ 161 పరుగులకు ఆలౌట్ కావడంతో, ముంబై ఇండియన్స్ 54 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ముంబై జట్టు తమ పరంపరలను కొనసాగిస్తూ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది.