Man Eats Wifes Brain: మెక్సికోలో దారుణం జరిగింది. అల్వారో అనే వ్యక్తి తన భార్యను చంపిన తర్వాత ఆమె మెదడును టాకోస్ అనే మెక్సికో ఆహారంతో కలిపి తిన్నాడనే ఆరోపణల నేపథ్యంలో అరెస్ట్ చేయబడ్డాడు. 38 ఏళ్ల అతడిని జులై 2న ప్యూబ్లోలోని అతని ఇంటి నుంచి అరెస్టు చేసినట్లు ది మిర్రర్ నివేదించింది. వృత్తిరీత్యా బిల్డర్ అయిన అల్వారో జూన్ 29న తన భార్యను హత్య చేశాడు. శాంటా ముర్టే (అవర్ లేడీ ఆఫ్ హోలీ డెత్), డెవిల్ తనను నేరం చేయమని ఆదేశించినట్లు నిందితుడు పోలీసులకు చెప్పినట్లు తెలిసింది.
అల్వారో మరియా మోంట్సెరాట్(38)ను ఒక సంవత్సరం కిందటే వివాహం చేసుకున్నాడు. ఆమెకు 12 నుంచి 23 సంవత్సరాల వయస్సు గల ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. నిందితుడు తన భార్య మెదడులో కొంత భాగాన్ని టాకోస్‌లో తిన్నాడని, ఆమె పగిలిన పుర్రెను బూడిదగా ఉపయోగించినట్లు అంగీకరించాడని మిర్రర్ నివేదిక పేర్కొంది. బాధితురాలి మృతదేహాన్ని ముక్కలు చేసి ప్లాస్టిక్ సంచిలో ఉంచాడు.
Also Read: Delhi : పోర్న్ వీడియోలను చూడాలని భార్యను బలవంతం పెట్టిన భర్త .. కట్ చేస్తే సీన్ రివర్స్..
ఆరోపించిన హత్య జరిగిన రెండు రోజుల తరువాత, నిందితుడు తన నేరాన్ని అంగీకరించడానికి తన భార్య కుమార్తెలలో ఒకరికి ఫోన్ చేసాడు. అతను తన భార్య కుమార్తెలలో ఒకరిని వచ్చి తన అమ్మను తీసుకువెళ్లమని చెప్పాడు. ఎందుకంటే ‘నేను ఇప్పటికే ఆమెను చంపి బ్యాగ్‌లలో ఉంచాను'” అని చెప్పినట్లు బాధితురాలి తల్లి మరియా అలిసియా మోంటియెల్ సెరాన్ స్థానిక మీడియాతో అన్నారు. ఆ వ్యక్తి తన కుమార్తె శరీరాన్ని కొడవలి, ఉలి, సుత్తితో నరికివేసినట్లు చెప్పారు. అతను డ్రగ్స్ కూడా వినియోగించాడని.. అతనికి మానసిక సమస్యలు ఉన్నాయని తాను భావిస్తున్నానని భాధితురాలి తల్లి పేర్కొంది. బాధితురాలి కుమార్తెలను శారీరకంగా, లైంగికంగా వేధిస్తున్నాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఇదిలావుండగా, పోలీసులు విచారణలో వారి ఇంటిలో చేతబడి బలిపీఠాన్ని కూడా కనుగొన్నారు. విచారణ సమయంలో అధికారులు తనను ఎందుకు ఇలా చేశావని ప్రశ్నించగా.. డెవిల్ , శాంటాముర్టే(అవర్ లేడీ ఆఫ్ హోలీ డెత్) తనను ఆదేశించాడని.. అందుకే హత్య చేసినట్లు నేరం అంగీకరించాడు.