సన్‌రైజర్స్ హైదరాబాద్ డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మపై మాజీ క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్ మరోసారి ఫైర్ అయ్యారు. ఇంతకుముందు చెప్పు చూపి బెదిరించగా.. ఇప్పుడు నీకు తన్నులు తప్పేలా లేదన్నట్లుగా ఓ మీమ్ షేర్ చేశాడు. మరోసారి "చెత్త షాట్ ఆడి ఔటయ్యావు’’ అంటూ ఓ వ్యక్తి కర్ర చేతిలో పట్టుకుని మరో వ్యక్తిని తరుముతున్నట్లుగా ఉన్న మీమ్ ఒకటి షేర్ చేశాడు. కాగా.. యువరాజ్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో ఆస్ట్రేలియా బౌలర్లను ఎదుర్కోవడంలో టీమిండియా విఫలమయ్యారని సునీల్ గవాస్కర్ అన్నారు. స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. “రోహిత్ శర్మ ఓ తప్పుడు షాట్ ఆడి అవుట్ కావడం పెద్దదెబ్బ అన్నారు.