మెగా హీరో వరుణ్‌తేజ్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ఆపరేషన్ వాలెంటైన్.. ఎయిర్‌ఫోర్స్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఆపరేషన్ వాలెంటైన్ మూవీ తెరకెక్కుతోంది. యథార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాతో శక్తి ప్రతాప్ సింగ్ దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు.తెలుగు మరియు హిందీ భాషల్లో మార్చి 1న ఆపరేషన్ వాలెంటైన్ మూవీ రిలీజ్ కాబోతుంది.. గత కొన్నాళ్లుగా వరుస పరాజయాలతో డీలా పడిన వరుణ్‌తేజ్ కెరీర్‌కు ఈ మూవీ విజయం ఎంతో కీలకంగా మారింది. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ కూడా భారీగా నిర్వహిస్తున్నారు..ఇటీవల ఈ సినిమా ట్రైలర్‌ను సల్మాన్‌ఖాన్, రామ్‌చరణ్ రిలీజ్ చేశారు.తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్సయింది. ఫిబ్రవరి 25న ఆదివారం హైదరాబాద్‌లో ఈ వేడుక జరుగనుంది.ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా హాజరుకానున్నారు.
పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న తర్వాత చిరంజీవి హాజరుకానున్న ఫస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇదే కావడం విశేషం.. తన ఫ్యామిలీ హీరో మూవీ వేడుకకు చిరంజీవి గెస్ట్‌గా రావడం ఎంతో ఆసక్తికరంగా మారింది. పద్మవిభూషణ్ అందుకున్న తర్వాత ఆపరేషన్ వాలెంటైన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ద్వారా ఫస్ట్ టైమ్ ప్రేక్షకుల ముందుకు రానుండటంతో చిరంజీవి ఈ వేడుకలో ఏం మాట్లాడుతారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ ఈవెంట్ లో చిరంజీవితో పాటు మరికొందరు టాలీవుడ్ డైరెక్టర్స్ కూడా హాజరుకానున్నట్లు తెలిసింది.ఆపరేషన్ వాలెంటైన్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ మానుషి చిల్లార్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే రుహాణిశర్మ, నవదీప్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సోనీ పిక్చర్స్‌తో కలిసి సందీప్ ముద్దా ఈ మూవీని గ్రాండ్ గా నిర్మించారు.ఆపరేషన్ వాలెంటైన్ మూవీని ఫిబ్రవరి 16న రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో ఈ మూవీ వాయిదాపడింది. ఆపరేషన్ వాలెంటైన్ మూవీ వరుణ్ తర్వాత వరుణ్ తేజ్ పలాస 1978 దర్శకుడు కరుణకుమార్‌తో మట్కా అనే సినిమా చేస్తున్నాడు.