Mega Job Fair: సీనియర్ రాజకీయ నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోమ్ మంత్రివర్యులు మరియు రాజ్య సభ సభ్యులు తూళ్ల దేవేందర్ గౌడ్ పుట్టిన రోజు సందర్భంగా నిరుద్యోగులకు శుభవార్త చెబుతున్నారు.. దేవేందర్‌గౌడ్ 70వ పుట్టిన రోజు సందర్భంగా ఏడాది పొడవునా పుట్టినరోజు వేడుకులు జరుగుతోన్న నేపథ్యంలో.. ఆ వేడుకలలో భాగంగా మెగా జాబ్ మేళా నిర్వహించబోతున్నారు.. మహేశ్వరం నియోజకవర్గంలోని యువతి యువకులు ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కుమారులు కోరుతున్నారు.
ఇంతకీ, ఆ మెగా జాబ్ మేళా ఎప్పుడనే విషయాల్లోకి వెళ్తే.. ఈ నెల 23వ తేదీన (23 ఏప్రిల్ 2023), తుక్కుగూడలోని దేవేంద్ర విద్యాలయంలో ఉదయం 9 గంటల నుండి ప్రారంభంకాబోతోంది. ఇక, ఈ జాబ్ మేళాలో పాల్గొనదలిచినవారు.. ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.. ఈ కింద పేర్కొన్న లింక్‌ను క్లిక్ చేసి.. మీ వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మెగా జాబ్ మేళాలో 50కి పైగా కంపెనీలు పాల్గొననుండగా.. 5 వేలకు పైగా మందికి ఉద్యోగాలు కల్పించబోతున్నారు.
Click the below 👇 link for Registration:
☑️ https://veerendergoud.in/jobfair
☑️ https://veerendergoud.in/register