Jayaprada: అలనాటి మేటి నటి జయప్రద గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అందానికి అందం, అభినయానికి అభినయం ఆమె సొంతం. స్టార్ హీరోలు అందరి సరసన నటించి మెప్పించిన హీరోయిన్ జయప్రద. కేవలం తెలుగు మాత్రమే కాకుండా అన్ని భాషల్లో కూడా ఆమె స్టార్ హీరోలతో నటించింది. తెలుగు నేలపై పుట్టి బాలీవుడ్ లో తిరుగులేని నటిగా మారిన హీరోయిన్స్ లో జయప్రద మొదటి స్థానంలో ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక సినిమాల తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేసి అక్కడ కూడా తనదైన విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం జయప్రద బుల్లితెర షో లో జడ్జిగా వ్యవహరిస్తుంది. అయితే సాధారణంగా సెలబ్రిటీల జీవితాలు అన్నీ పైకి కనిపించే పువ్వులు మాత్రమే.. కింద వారిని గాయపరిచే ముళ్ళు ఎన్నెన్నో. జయప్రద విషయంలోనూ అదే జరిగింది. ఆమె పైకి ఎన్ని విజయాలు సాధించినా ఇంట్లో మాత్రం అనేక సమస్యలను ఎదుర్కొంది. అందుకు కారణం ఆమె భర్త శ్రీకాంత్ నహతా.
Allu Arjun: ఒక స్మగ్లర్ కు నేషనల్ అవార్డు ఎలా ఇచ్చారు.. బన్నీ ఏమన్నాడంటే..?
1986లో జయప్రద ప్రముఖ నిర్మాత శ్రీకాంత్ నహతాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే అప్పటికే శ్రీకాంత్ కు పెళ్లి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. జయప్రదను ప్రేమించిన శ్రీకాంత్.. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. దీంతో శ్రీకాంత్ మొదటి భార్య చంద్ర జయప్రదను ఎన్నో హింసలు పెట్టింది. తన భర్త నుంచి విడిపోవాలని ఎంతో ఒత్తిడి తెచ్చింది. ఆ ఒత్తిడి తట్టుకోలేక 1990లో జయప్రద విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే ఆ సమయంలో జయప్రదను వెంటనే ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు ఆమెను రక్షించారు. ఆ తర్వాత కూడా వారి వైవాహిక జీవితం సజావుగా సాగలేదు. ఈసారి అందుకు కారణం పిల్లలు. జయప్రదకు ఇప్పటివరకు పిల్లలు పుట్టలేదు. ఇక తనకు పిల్లలు పుట్టరు అని తెలిశాక తన సోదరి కుమారుడైన సిద్దార్థ్ ను ఆమె దత్తత తీసుకుంది. ఇలా చెప్పుకుంటూ పోతే జయప్రద జీవితంలో ఎన్నో వివాదాలు.. విషాదాలు ఉన్నాయనే చెప్పాలి. అయినా వీటన్నింటిని దాటుకుని జయప్రద నవ్వుతూ బతికేస్తుంది. ఆమె జీవితం గురించి తెలిసిన వారందరూ కూడా జయప్రద సినీ కెరియర్లో ఎంత విజయాలను అందుకున్నా కూడా వ్యక్తిగత జీవితంలో ఆమె పరాజయాన్ని అందుకుందని చెప్పకువస్తున్నారు.