90 దశకంలో టాలీవుడ్ లో హీరోయిన్ మీనా ఒక వెలుగు వెలిగింది. ఆ తర్వాత మీనా పెళ్లి చేసుకొని టాలీవుడ్ ఇండస్ట్రీకి కాస్త దూరంగా ఉంది. ఈ మధ్యకాలంలో ఆవిడ తన భర్తను కోల్పోయింది. ఆ విషాదకర సంఘటన నుంచి బయటికి రావడానికి మీనా మళ్లీ సినిమాల్లో., అలాగే బుల్లితెరపై కనిపిస్తోంది. ఇప్పుడిప్పుడే వరుస షూటింగ్స్ తో బిజీబిజీగా గడిపేస్తోంది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా మలయాళ, తమిళ ఇండస్ట్రీలో కూడా మీనా సినిమాలు చేస్తుందని సమాచారం. ఇది ఇలా ఉండగా.. మొదటి భర్త మరణించిన కొన్ని రోజులకే మీనా రెండో పెళ్లిపై సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు వచ్చాయి. అందులో మీనా అతి త్వరలోనే రెండో వివాహం చేసుకోబోతుందని., అందుకోసం వరుడు కూడా ఫిక్స్ అయ్యారు అంటూ లేనిపోని వార్తలు వచ్చాయి.
ALSO READ: ELECTIONS 2024 : కాంగ్రెస్ నాలుగో జాబితా రిలీజ్ – మోడీ పై పోటీ చేసేది ఈయనే..!
ఇకపోతే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మీనా తన రెండో పెళ్లి గురించి పలు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో తనపై రెండో పెళ్లి చేసేందుకు రెడీ అయినట్లు వచ్చిన వార్తలు పై కాస్త ఘాటుగానే ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా, అలాగే మీడియా కూడా డబ్బు కోసం ఏమైనా రాస్తానన్నారు అంటూ చెబుతూనే.. రోజురోజుకి మీడియా రంగం దిగజారిపోతుందని వాస్తవాలు తెలుసుకొని రాస్తే.. అందరికీ మంచిదంటూ చెప్పుకొచ్చింది. దేశంలో తనలాగే ఒంటరిగా జీవించేవారు చాలామంది మహిళలు ఉన్నారని ఆమె చెప్పింది. ఇక తన తల్లిదండ్రులు, కూతురు భవిష్యత్తు కూడా ఆలోచన చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది.
ALSO READ: Tirumala: రేపు తిరుమలలో శ్రీ తుంబురు తీర్థ ముక్కోటి ఉత్సవం
తన భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటానో ఇప్పుడు ఎలా చెప్తాను అంటూ ప్రశ్నించింది. ముందుముందు భవిష్యత్తులో ఏం జరుగుతుందో తనకి ఎలాంటి ఆలోచన లేదని ప్రస్తుతానికి రెండో పెళ్లి గురించి ఎటువంటి ఆలోచన లేదని కారకండిగా చెప్పింది. తనకు రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం.. తానే స్వయంగా మీడియాకు ప్రకటిస్తానని అప్పటివరకు ఇలాంటి పుకార్లను పుట్టించ వద్దు అంటూ విజ్ఞప్తి చేసింది.