ప్రముఖ మొబైల్ కంపెనీ మోటో కంపెనీ సరికొత్త ఫీచర్స్ తో సరసమైన ధరలతో కొత్త స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తుంది.. ఇప్పటివరకు విడుదలైన అన్ని ఫోన్లకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.. తాజాగా మరో కొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి రాబోతుంది.. మోటారోలా ఏడ్జ్ 50 ప్రో పేరుతో స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి త్వరలో లాంచ్ కాబోతుంది.. ఆ ఫోన్ పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ మోటోరోలా ఎడ్జ్ 50ప్రో ఫోన్ 1.5కె రిజల్యూషన్, 144హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల పీఓఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ప్యానెల్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ కూడా కలిగి ఉంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జెనరేషన్ 3 చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది.. ఆండ్రాయిడ్ 14 ఓఎస్‌పై ఈ ఫోన్ రన్ అవుతుంది.. ఇక కెమెరా విషయానికొస్తే.. 50ఎంపీ ప్రధాన సెన్సార్, 13ఎంపీ అల్ట్రావైడ్ కెమెరాలతో పాటుగా సెన్సార్స్ ను కలిగి ఉంటుంది.. ఛార్జింగ్‌కు సపోర్టుతో 4,500ఎంఎహెచ్ బ్యాటరీ ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను కూడా కలిగి ఉంది..
ధర విషయానికొస్తే.. ఎడ్జ్ 50 ప్రో ధర రూ. 35వేల లోపు ఉండే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా గతంలో ఈ కంపెనీ నుంచి వచ్చిన మోటరోలా ఎడ్జ్ 40ని రూ. 26,999కి లాంచ్ చేసింది. మోటో ఎడ్జ్ 40 నియో ఆన్‌లైన్‌లో రూ.22,999కి సేల్ చేస్తుంది.. ఈ ధరలతోనే ఫోన్ ను మార్కెట్ లోకి తీసుకురాబోతుంది.. ఇక పోతే ఈ ఫోన్ ఏప్రిల్ 3న మార్కెట్ లోకి లాంచ్ కానుంది.. ప్రముఖ బ్యాంక్ కార్డుల పై కొనుగోలు చేస్తే ధరలు ఇంకాస్త తగ్గుతాయని తెలుస్తుంది..