Medchal Murder Case : మేడ్చల్ జిల్లాలోని మునీరాబాద్ ప్రాంతంలో ఘోర ఘటన చోటుచేసుకుంది. 25 ఏళ్ల యువతిని గుర్తు తెలియని వ్యక్తులు బండరాళ్లతో కొట్టి హత్య చేశారు. అనంతరం మృతదేహంపై పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఈ అమానుష ఘటన స్థానికులను దిగ్భ్రాంతికి గురి చేసింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలను పరిశీలించారు. యువతి హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఆమె ఎవరూ, ఇక్కడకు ఎలా వచ్చిందీ, ఎవరితో వచ్చిందీ తెలుసుకునేందుకు పోలీసులు పరిశోధన ముమ్మరం చేశారు.
Acer Aspire 3: రూ. 50 వేల ల్యాప్ టాప్ రూ. 30 వేలకే.. లేట్ చేయకండి
పరిసర ప్రాంతాల్లోని సీసీ పుటేజీని పరిశీలిస్తూ నిందితుల వివరాలను గాలిస్తున్నారు. మేడ్చల్ జిల్లాలో నమోదైన మిస్సింగ్ కేసులను సమీక్షిస్తున్నారు పోలీసులు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు బై పాస్ అండర్ బ్రిడ్జి కింద యువతి దారుణ హత్యకు గురైందని సమాచారం అందడంతో ఘటన స్థలానికి చేరుకున్నామని తెలిపారు. 25 – 30సంవత్సరాలు ఉంటే యువతి దారుణ హత్యకు గురైందన్నారు. తలపై రాయితో మోది ముఖం గుర్తుపట్టడానికి లేకుండా పోయిందని, అంతేకాకుండా.. నిప్పటించిన వల్ల మొహం మొత్తం కాలిపోయిందని ఆయన పేర్కొన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న మేడ్చల్ పోలీసులు, క్లూస్ టీమ్ఆస్ ధారాలను సేకరిస్తున్నారని, మని అని యువతి చేతిపై శ్రీకాంత్ అని తెలుగులో నరేందర్ అని ఇంగ్లీష్ లో టాటూ ఉందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఆయన పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే… హైదరాబాద్ ప్రాంతంలో ఇటీవలి కాలంలో వరుస హత్యలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. రెండు వారాల క్రితం నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పుప్పాల్ గూడలో ఉన్న దేవాలయం సమీపంలో జరిగిన హత్యలు సంచలనం సృష్టించాయి. గత మూడు రోజుల క్రితం ఓ మాజీ ఆర్మీ జవాన్ తన భార్యను కిరాతకంగా హత్య చేసిన ఘటనలో మృతదేహాన్ని ముక్కలు చేసి, వాటిని ప్రెజర్ కుక్కర్‌లో ఉడికించి పొడిగా మార్చి చెరువులో పడేశాడు. ఈ వరుస సంఘటనలతో నగరంలో భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తాజా మేడ్చల్ హత్య కేసు మరింత భయాందోళన కలిగిస్తోంది.
Republic Day Celebrations: భారత గణతంత్ర దినోత్సవ వేడుకకు అతిపెద్ద ముస్లిం దేశ అధ్యక్షుడు…