హామీలు నెరవేర్చని కాంగ్రెస్‌ను ఇంటికి పంపించాలని గోవా సీఎం ప్రమోద్ సావంత్ తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం సాయంత్రం మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు తరపున గోవా సీఎం ప్రమోద్ సావంత్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జుల మార్పు కసరత్తుపై చర్చలు కొనసాగుతున్నాయి. సీఎంవో పిలుపుతో పలువురు నేతలు తాడేపల్లికి క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో.. నందికొట్కూరు నియోజకవర్గ ఇంఛార్జి మార్పుపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. నందికొట్కూరు నియోజకవర్గ ప్రస్తుత ఇంఛార్జి బైరెడ్డి సిద్దార్థ రెడ్డికి సీఎంవో నుంచి పిలుపు వచ్చింది. దీంతో ఇంఛార్జి మార్పుపై కసరత్తు చేస్తుంది అధిష్టానం. మరోవైపు.. సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ ను బైరెడ్డి కలిశారు. నందికొట్కూరు…
వైసీపీలో నియోజకవర్గ ఇంఛార్జుల మార్పుల- చేర్పుల కసరత్తులు కొనసాగుతున్నాయి. అనంతపురం జిల్లాలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి నేతలు క్యూ కడుతున్నారు. వైసీపీ అధిష్టానంతో నేతల వరుస భేటీలు జరుగుతున్నాయి. మాజీ మంత్రి కొడాలి నాని, ఎంపీ గోరంట్ల మాధవ్ తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. మచిలీపట్నంలో పోటీపై పేర్నినానితో సీఎం చర్చించారు. అలాగే హిందూపురం ఎంపీ సీటు మాధవ్ కు దక్కుతుందా లేదా అనేది అనుమానమే.. మరోవైపు సీఎం…
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్వస్థలమైన అక్కంపేట గ్రామాన్ని రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ గ్రామంగా ప్రకటించింది. ఈ క్రమంలో.. జీవో జారీ చేయడంతో అక్కంపేట గ్రామంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పర్యటించారు. ప్రొఫెసర్ జయశంకర్, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కంపేట గ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా ప్రకటిస్తూ ఇచ్చిన జీవో కాపీని గ్రామస్తులకు అందజేశారు.
ఈ ఎన్నికల్లో పోటీచేసిన అగ్రనేతల ఇలాఖాల్లో పోలింగ్ శాతం ఎలా ఉందంటే.. కేసీఆర్, రేవంత్ బరిలో ఉన్న కామారెడ్డిలో 34.6 శాతం పోలింగ్ నమోదైంది. కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ లో 42.54 శాతం పోలింగ్ నమోదైంది. ఈటల బరిలో ఉన్న హుజురాబాద్ లో 41.40 శాతం ఓటింగ్.. రేవంత్ పోటీ చేస్తున్న కొడంగల్ లో 43.20 శాతం ఓటింగ్ నమోదైంది. భట్టి విక్రమార్క పోటీ చేస్తున్న మధిరలో 40.67 శాతం ఓటింగ్.. బండి సంజయ్ బరిలో…
Errabelli Dayakar Rao : తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోద ముద్ర వేసిన విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాల మేరకే మూడు గ్రామ పంచాయతీలుగా భద్రాచలం వికేంద్రీకరణ జరుగుతుందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
గెలిచిన నియోజకవర్గాన్ని.. గెలిపించిన ప్రజలను ఆయన మర్చిపోయారా? స్థానిక పార్టీ కేడర్‌కు ముఖం చాటేస్తున్నారా? ఏ విషయంలో కేడర్‌కు భరోసా లభించడం లేదు? పార్టీ శ్రేణులు తమ అభిమాన నేతపై గుర్రుగా ఉన్నాయా? అచ్చెన్న అందుబాటులో లేరని కేడర్ ఆందోళనవైసీపీ గాలిలోనూ శ్రీకాకుళం జిల్లాలో ఎమ్మెల్యేగా గెలిచిన ఇద్దరు టీడీపీ నేతల్లో అచ్చెన్నాయుడు ఒకరు. ప్రస్తుతం ఏపీ టీడీపీ అధ్యక్షుడు కూడా. గత ఎన్నికల్లో టెక్కలి స్థానాన్ని ఆయన నిలబెట్టుకున్నారు. నియోజకవర్గంలో టీడీపీకి గట్టి పట్టు ఉన్నా..…