Kurnool: కర్నూలు జిల్లా పెంచికలపాడు వద్ద ఉన్న విశ్వభారతి మెడికల్ కాలేజీలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని హన్సిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటనతో విద్యార్థుల్లో భయాందోళన వాతావరణం నెలకొంది. హన్సిక కాలేజ్ బిల్డింగ్ రెండవ అంతస్తు పైనుంచి దూకడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కాలేజ్ సిబ్బంది స్పందించి, ఆమెను విశ్వభారతి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతోందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.
Read Also: Honorarium Increased: నాయీ బ్రాహ్మణుల భృతిని రూ. 25 వేలకు పెంచుతూ ఉత్తర్వులు
హన్సిక అనంతపురం జిల్లా ఆత్మకూరు ప్రాంతానికి చెందిన విద్యార్థినిగా గుర్తించారు. అయితే చదువులో ఒత్తిడి కారణంగా హన్సిక ఈ చర్యకు పాల్పడిందా? లేక మరేదైనా వ్యక్తిగత కారణం ఉన్నదా? అనే కోణంలో పోలీసులు, కాలేజ్ అధికారులు విచారణ చేపట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.