Kurnool: కర్నూలు జిల్లా పెంచికలపాడు వద్ద ఉన్న విశ్వభారతి మెడికల్ కాలేజీలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని హన్సిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటనతో విద్యార్థుల్లో భయాందోళన వాతావరణం నెలకొంది. హన్సిక కాలేజ్ బిల్డింగ్ రెండవ అంతస్తు పైనుంచి దూకడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కాలేజ్ సిబ్బంది స్పందించి, ఆమెను విశ్వభారతి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతోందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా…