SDLC Tragedy: తెలంగాణలోని శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (SLBC) టన్నెల్‌లో సంభవించిన ఘోర ప్రమాదం కారణంగా సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ ఆపరేషన్‌లో వందలాది మంది పాల్గొంటున్నారు. భారత సైన్యం ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయబడింది. క్షతగాత్రులకు తక్షణ వైద్యం అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సహాయక చర్యల్లో భాగంగా రెండు ఆర్మీ హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచారు. ఎన్డీఆర్‌ఎఫ్ (NDRF) నుంచి 120 మంది, ఎస్డీఆర్‌ఎఫ్ (SDRF) నుంచి 70 మంది, సింగరేణి రెస్క్యూ టీం నుంచి 35 మంది, అలాగే హైడ్రా నుంచి 15 మంది సహాయ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు.
Read Also: Calcium Rich Foods: పిల్లల ఎముకలు దృఢంగా ఉండాలంటే వీటిని అలవాటు చేయాల్సిందే!
ఈ భారీ ఆపరేషన్‌ను సమీక్షించేందుకు, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్, ఐఏఎస్ శ్రీధర్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, నాగర్‌కర్నూల్ కలెక్టర్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్, ఎన్డీఆర్‌ఎఫ్ కమాండెంట్లు సుదీశ్ కుమార్, ప్రసన్న, పవన్, ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఆర్‌ఎఫ్ హరినాథ్‌రెడ్డి, సింగరేణి రెస్క్యూ టీం చీఫ్ కలందర్ వంటి ముఖ్య అధికారులు అక్కడే మకాం వేసి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
ఇప్పటికే మొదటి టీంగా 8 మంది మాత్రమే సొరంగంలోకి వెళ్లగా, రెండో టీంగా 23 మంది, మూడో టీంగా దాదాపు 50 మంది లోపలకి ప్రవేశించి సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. వారి కృషితో త్వరలోనే చిక్కుకున్నవారిని కాపాడేందుకు అవకాసం ఉందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ చర్యలు నిరంతరాయంగా కొనసాగుతుండగా, బాధితులను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి రక్షణ బృందాలు అహర్నిశలు శ్రమిస్తున్నాయి.