దేశ రాజధాని ఢిల్లీ ఇప్పటికే నీటి సంక్షోభంతో అల్లాడుతోంది. ఓ వైపు తీవ్రమైన ఎండ.. ఇంకోవైపు నీటి కొరత.. ఇలా ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే.. తాజాగా మరో కొత్త కష్టం వచ్చి పడింది. రాజధాని ప్రాంతంలో చాలా చోట్ల విద్యుత్ కోతలు మొదలయ్యాయి. తాగునీళ్లతోనే అష్టకష్టాలు పడుతుంటే.. ఇప్పుడు కరెంట్ కష్టాలు కూడా తోడవ్వడంతో నగర వాసులు మరిన్ని ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే కేంద్రం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఆప్ మంత్రి అతిషి డిమాండ్ చేసింది. ఈ మేరకు కొత్తగా బాధ్యతలు తీసుకున్న కేంద్రమంత్రి మనోహర్ లాల్ కట్టర్‌ను కలిసి సమస్య వివరిస్తామని అతిషి తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని మండోలాలోని పీజీసీఐఎల్ సబ్ స్టేషన్‌లో మంటలు చెలరేగాయి. అక్కడ నుంచి ఢిల్లీకి 1,500 మెగావాట్ల విద్యుత్ సరఫరా అవుతుంది. ప్రస్తుతం అగ్నిప్రమాదం సంభవించి సబ్ స్టేషన్ కాలిపోవడంతో ఢిల్లీకి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
ఇది కూడా చదవండి: Toothache : ఈ చిన్న చిట్కాలు పాటిస్తే.. పంటి నొప్పి నుంచి ఉపశమనం ఖాయం!
ఇదిలా ఉంటే దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం కూడా తీవ్రమైన ఎండలు ఉన్నాయి. 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఓ వైపు ఎండలు.. ఇంకోవైపు విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇక పిల్లలు, వృద్ధుల పరిస్థితి మరీ ఇబ్బంది కరణంగా మారింది. ఉక్కపోతతో బెంబేలెత్తిపోతున్నారు. ఇదిలా ఉంటే సోషల్ మీడియా వేదికగా విద్యుత్ కోతలపై నెటిజన్లు కంప్లంట్‌లు చేస్తున్నారు. తక్షణమే విద్యుత్ కోతలను నివారించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఆప్ మంత్రి అతిషి స్పందించారు. కేంద్రంతో చర్చించి సమస్య పరిష్కరిస్తామని వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Seethakka: ప్రజా భవన్ను మంత్రి సీతక్క ఆకస్మిక సందర్శన.. ప్రజల నుండి దరఖాస్తుల స్వీకరణ
#WATCH | Delhi Minister Atishi says, "A fire broke out in a sub-station of PGCIL in Mandola, Uttar Pradesh, from where Delhi gets 1,500MW of power and due to the fire there, there has been a power cut in many parts of Delhi… This is a very serious issue… I will seek time… pic.twitter.com/2V6OCjKXAT
— ANI (@ANI) June 11, 2024