Mass Jatara : విభిన్న చిత్రాలతో మాస్ మహారాజ్ రవితేజ కొన్నేళ్లుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పుడు ఆయన 75వ సినిమా మైలురాయికి చేరుకున్నారు. తన ప్రతిష్టాత్మక 75వ సినిమాకి రచయిత-దర్శకుడు భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. గతేడాది దీపావళి సందర్భంగా రవితేజ 75వ చిత్రం టైటిల్ ని, విడుదల తేదీని నిర్మాతలు ప్రకటించారు. “మాస్ జాతర” చిత్రం మే 9, 2025న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. “మాస్ జాతర” అనే టైటిల్ కి తగ్గట్టుగానే ఈ సినిమా థియేటర్లలో మాస్ జాతరను తలపిస్తుందని నిర్మాతలు నమ్మకం వ్యక్తం చేశారు. మాస్ మహారాజా రవితేజ అంటేనే వినోదానికి, మాస్ సినిమాలకు పెట్టింది పేరు.
Read Also:Adi Srinivas: నీ వల్ల సిరిసిల్లలో ఒక్క కార్మికుడి జీవితం కూడా మారలేదు.. కేటీఆర్ పై ఫైర్
ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన పలు కీలక సీన్లను చిత్ర యూనిట్ చిత్రీకరిస్తున్నారు. ఎలాంటి బ్రేక్ లేకుండా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలని రవితేజ ఫిక్స్ అయ్యాడట. దీంతో ఈ సినిమా షూటింగ్ అనుకున్న దానికంటే కూడా త్వరగా తెరకెక్కుతోందని చిత్ర వర్గాల టాక్. ఇక ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల మరోసారి రవితేజ సరసన రొమాన్స్ చేయబోతుంది. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రం మళ్ళీ రవితేజ నుంచి ఒక వింటేజ్ ట్రీట్ ఇచ్చేలా ఉంటుందని మేకర్స్ చాలా కాన్ఫిడెంట్ గా ఉండగా ఇపుడు ఓ సాలిడ్ అప్డేట్ ఈ చిత్రంపై వినిపిస్తుంది. దీనితో ఈ రానున్న జనవరి 26 రవితేజ పుట్టిన రోజు కానుకగా టీజర్ కట్ ని మేకర్స్ రిలీజ్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ కూడా త్వరలోనే రానున్నట్లుగా తెలుస్తుంది.
Read Also:Auto Expo 2025 : మారుతి సుజుకి ఆటో ఎక్స్‌పోలో జిమ్నీ ప్రదర్శన… భవిష్యతులో థార్ కు గట్టిపోటీ