Maruti Wagon R Offers and Discounts 2023 July: మీరు తక్కువ బడ్జెట్‌లో కొత్త కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా?.. అందులోనూ ప్రముఖ కార్ల తయారీ సంస్థ ‘మారుతీ సుజుకీ’కి చెందిన వేగనార్ కారును కొనాలనుకుంటున్నారా?.. అయితే ఓ అద్భుత ఆఫర్ అందుబాటులో ఉంది. వేగనార్ కారుపై ప్రస్తుతం భారీ డిస్కౌంట్ ఉంది. దీంతో తక్కువ ధరకు మీరు వేగనార్ కారుని ఇంటికి తీసుకువెళ్లొచ్చు. వేగనార్ కారుపై ఉన్న ఆఫర్ ఏంటి, ఎంత ధరకు కొనుగోలుచేయొచ్చు అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
Maruti Wagon R Offer:
ప్రస్తుతం మారుతీ కంపెనీకి చెందిన పలు కార్లపై డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇప్పుడు వ్యాగనార్ కారుపై ఉన్న ఆఫర్ గురించి తెలుసుకుందాం. వ్యాగనార్ కారుపై ఏకంగా రూ. 49 వేల వరకు డిస్కౌంట్ ఉంది. ఈ డిస్కౌంట్ ఆఫర్ జూలై 31 వరకే అందుబాటులో ఉంది. దాంతో ఈ కారు కొనుగోలు చేయాలని భావించే వారు ఈ డీల్ ఉపయోగించుకోవచ్చు.
Maruti Wagon R Mileage:
వ్యాగనార్ కారులో పలు వేరియంట్లు ఉన్నాయి. పెట్రోల్ వేరియంట్ లీటరుకు 24 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. సీఎన్‌జీ వేరియంట్ 34 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. వ్యాగనార్ ఎక్స్‌షోరూమ్ ధర రూ. 5.5 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఇప్పుడు దీనిపై రూ. 49 వేల వరకు డిస్కౌంట్ ఉంది. దాంతో వ్యాగనార్ కారుని మీరు 5 లక్షలకే కొనుగోలు చేయొచ్చు.
Also Read: Protein Foods: వీటిని బ్రేక్‌ఫాస్ట్‌లో తింటే.. జిమ్‌కి వెళ్లకుండానే మీ నడుము సన్నబడుతుంది!
Maruti Wagon R Discounts:
రూ. 49 వేలలో రూ. 25 వేల వరకు క్యాష్ డిస్కౌంట్ ఉంది. ఎక్స్‌ఛేంజ్ బోనస్ కింద రూ. 20 వేలు వరకు తగ్గింపు పొందొచ్చు. ఇక కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 4 వేలు వరకు లభిస్తుంది. అయితే మీరు ఎంచుకునే కారు వేరియంట్ ఆధారంగా ఏ ఆఫర్‌లో మార్పు ఉంటాయి. మరోవైపు డీలర్‌షిప్, ప్రాంత ప్రాతిపదికన కూడా ఆఫర్ మారుతూ ఉంటుంది.
Maruti Car Offers:
మారుతీ సుజుకీకి సంబందించిన మిగతా కార్లపై కూడా డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. అల్టో 800 కారుపై రూ. 50 వేల వరకు తగ్గింపు ఉండగా.. మారుతీ సుజుకీ అల్టో కే10పై రూ. 60 వేల వరకు డిస్కౌంట్ ఉంది. ఎస్‌ప్రెసో కారుపై రూ. 65 వేల వరకు తగ్గింపు ఉండగా.. మారుతీ సెలెరియోపై రూ. 65 వేల వరకు తగ్గింపు ఉంది. స్విఫ్ట్ కారుపై రూ. 50 వేల డిస్కౌంట్, డిజైర్ కారుపై రూ. 17 వేల ఆఫర్ ఉంది.
Also Read: Sachin Tendulkar: తర్వాతి తరం సూపర్‌స్టార్ వచ్చేశాడు.. ఇక అతడినే ఫాలో అయితే: సచిన్