Here is Waist Loss Food for Breakfast: ఉదయం పూట ‘అల్పాహారం’ అత్యంత ముఖ్యమైనది. ఎందుకంటే రోజంతా శరీరంలో శక్తిని అందించడానికి ఇది సహాయపడుతుంది. మీరు సరైన అల్పాహారం తీసుకోకుంటే.. త్వరగా ఆకలి వేయడమే కాకుండా, శక్తి కూడా తగ్గిపోతుంది. అందుకే ఉదయం మంచి అల్పాహారం తీసుకోవాలి. అదే సమయంలో బరువు తగ్గాలనుకునేవారు బ్రేక్ ఫాస్ట్‌లో ప్రోటీన్స్ అధికంగా ఉండే వాటిని తీసుకోవాలి. దాంతో మీ ఆకలిని అదుపులో ఉంచుకోవచ్చు. బరువు తగ్గడానికి మీరు బ్రేక్ ఫాస్ట్‌లో (Weight Loss Breakfast Food) ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
ఓట్ మీల్:
ఓట్ మీల్‌లో ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది. వోట్ మీల్ సులభంగా జీర్ణమవుతుంది. ఇది తిన్నాక ఎక్కువసేపు ఆకలి వేయదు. అందుకే ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌లో ఓట్ మీల్‌ని తింటే బరువు సులభంగా తగ్గవచ్చు.
మూంగ్ దాల్ చీలా:
మూంగ్ దాల్ చీలా (పెసరపప్పుతో చేసే దోష)లో అనేక రకాల ప్రొటీన్లు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు పెరగరు. దీనితో పాటు మీరు శెనగపిండి చీలా కూడా తినవచ్చు. అంతేకాదు మజ్జిగతో శెనగపిండి చీలా కూడా తినవచ్చు.
Also Read: Emerging Asia Cup 2023: సెమీస్ చేరిన భారత్.. పాకిస్థాన్‌తో ఢీ!
ఉప్మా:
సెమోలినా మరియు కూరగాయలతో చేసిన ఉప్మా సులభంగా జీర్ణమవుతుంది. ఎందుకంటే ఇది తేలికపాటి ప్రోటీన్ అల్పాహారం. ఇది బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇది తయారు చేసుకోవడానికి నిముషాలు మాత్రమే పడుతుంది. కాబట్టి మీరు బరువు తగ్గాలని ఆలోచిస్తున్నట్లయితే సెమోలినా మరియు కూరగాయలతో చేసిన ఉప్మా బెటర్ అప్షన్.
పోహా
రుచిలోనూ, ఆరోగ్యంలోనూ పోహా మంచిది. ఎందుకంటే ఇందులో ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇది తక్కువ కేలరీల ఆహారం. అందుకే మీరు బరువును తగ్గించుకోవాలనుకుంటే.. మీరు రోజూ అల్పాహారంలో పోహా తినడం అలవాటు చేసుకోవాలి. పోహలో చాలా కూరగాయలను జోడించుకోవచ్చు.
Also Read: Sachin Tendulkar: తర్వాతి తరం సూపర్‌స్టార్ వచ్చేశాడు.. ఇక అతడినే ఫాలో అయితే: సచిన్