Facebook Love: ఫేస్‌బుక్ ప్రేమకథ.. ప్రియుడి కోసం సరిహద్దు దాటి పాక్ వెళ్లిన భారతీయ మహిళ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Facebook Love: పాకిస్తాన్ జాతీయురాలు సీమా హైదర్ నేపథ్యం, భారతదేశంలోకి ఆమె అక్రమ ప్రవేశంపై విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఒక భారతీయ మహిళ ఇప్పుడు తన ప్రేమికుడిని కలవడానికి సరిహద్దు దాటి వెళ్లింది. రాజస్థాన్‌లోని భివాడి జిల్లాకు చెందిన ఒక వివాహిత భారతీయ మహిళ, తాను ఫేస్‌బుక్‌లో స్నేహం చేసి, ప్రేమలో పడిన వ్యక్తిని కలవడానికి పాకిస్తాన్‌లోని వాయువ్య ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్స్‌కు వెళ్లింది.
అంజు అనే 35 ఏళ్ల భారతీయ మహిళ.. తన ఫేస్‌బుక్ స్నేహితుడు నస్రుల్లా ఖాన్ కలవడానికి పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ఫ్రావిన్స్‌లోని దీర్ సిటీకి జులై 21న వెళ్లిందని సమాచారం.ఉత్తరప్రదేశ్‌కు చెందిన అంజు.. దీర్‌కు చెందిన 29 ఏళ్ల నస్రుల్లా ఖాన్ ఫేస్‌బుక్ ద్వారా ఒకరికొకరు పరిచయమయ్యారు. నస్రుల్లా గతంలో పాఠశాల ఉపాధ్యాయుడు, కానీ ప్రస్తుతం మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్నారు. వారిద్దరూ సోషల్ మీడియాలో కలుసుకున్నారని, అంజు అతన్ని కలవడానికి సరిహద్దు వెళ్లింది.
Also Read
- Janasena Party: స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 30 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళిక
- రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్‌ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
- Nepal Floods: నేపాల్‌లో భారీ వరదలు.. 16 మంది హైదరాబాద్ ఎన్ఆర్ఐలు గల్లంతు..!
- 50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
Also Read: Instagram Love Tragedy: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. ఆపై న్యూడ్ వీడియో కాల్స్‌తో బ్లాక్‌మెయిల్
జైపూర్‌కు వెళ్లే నెపంతో గురువారం ఇంటి నుంచి వెళ్లిపోయారని, అయితే ఆమె పాకిస్థాన్‌లో ఉన్నట్లు కుటుంబసభ్యులకు తెలిసిందని మహిళ భర్త అరవింద్ పోలీసులకు తెలిపారు. తన స్నేహితుడిని కలవాలని చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయిందని అరవింద్ పోలీసులకు తెలిపాడు. అంజు అనే మహిళ కొన్ని రోజులకు జైపూర్ వెళ్తున్నట్లు భర్త అరవింద్‌కు చెప్పింది. అయితే ఆదివారం నాడు అంజు సరిహద్దు దాటి వెళ్లిందని అరవింద్ తెలుసుకున్నాడు. అంజు తమతో వాట్సాప్ ద్వారా టచ్‌లో ఉండేదని అరవింద్ తెలిపాడు. ఆమె ఆదివారం సాయంత్రం 4 గంటలకు అతనికి ఫోన్ చేసి, తాను లాహోర్‌లో ఉన్నానని, రెండు మూడు రోజుల్లో తిరిగి వస్తానని చెప్పింది.
పాకిస్తాన్‌లో అంజు ప్రేమికుల పుకారు గురించి అడిగినప్పుడు, అరవింద్ తనకు దాని గురించి తెలుసునని, అతని భార్య తన వద్దకు తిరిగి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.అరవింద్ భివాడిలో పనిచేస్తున్నాడు. అంజు కూడా ఒక ప్రైవేట్ సంస్థలో బయోడేటా ఎంట్రీ ఆపరేటర్‌గా ఉద్యోగం చేస్తోంంది. ఇద్దరు పిల్లలు ఉన్న ఈ జంట, అంజు అరవింద్‌తో కలిసి క్రైస్తవ మతంలోకి మారడంతో వివాహం చేసుకున్నారు. అరవింద్ తన భార్య. పిల్లలతో, అంజు సోదరుడితో కలిసి భివాడిలోని అద్దె ఫ్లాట్‌లో ఉన్నాడు.
Also Read: Phone Charging: రోజుకు ఎన్నిసార్లు ఫోన్ కు చార్జింగ్ పెట్టాలో తెలుసా?
గురువారం నాడు జైపూర్‌కు వెళ్లే నెపంతో అంజు భివాడిలోని తన ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత తన 29 ఏళ్ల ఫేస్‌బుక్ స్నేహితుడు నస్రుల్లాను కలవడానికి పాకిస్థాన్ వెళ్లింది.వైద్య రంగంలో పనిచేస్తున్న నస్రుల్లా, అంజు కొన్ని నెలల క్రితం ఫేస్‌బుక్‌లో స్నేహితులయ్యారని సమాచారం. ఆమె మొదట పోలీసు కస్టడీలో ఉంది, అయితే ఆమె ప్రయాణ పత్రాలను ధృవీకరించిన తర్వాత విడుదల చేశారు. “ప్రయాణ పత్రాలన్నీ సక్రమంగా ఉన్నాయని గుర్తించిన తర్వాత ఆమెను వెళ్లేందుకు అనుమతించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, దేశానికి చెడ్డపేరు తెచ్చేలా వారికి భద్రత కల్పించారు” అని తెలిసింది.
తాజావార్తలు
-
Janasena Party: స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 30 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళిక
-
Range Rover Sport Twenty Edition: రేంజ్ రోవర్ స్పోర్ట్ ట్వంటీ లిమిటెడ్ ఎడిషన్ విడుదల.. 537HP పవర్, కొత్త ఆరెంజ్ కలర్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్‌ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
ISI Spy Trap: పాక్ ISI స్పై ట్రాప్.. ‘నగ్న ఫొటోలు’ ఎరగా వేసి భారత రక్షణ అధికారులను టార్గెట్ చేస్తున్న పాక్ ISI?
-
Hrehaan Roshan: హృతిక్ రోషన్ కొడుకు సింగర్‌గా ఎంట్రీ.. తొలి పాటతోనే అదరగొట్టిన హృహాన్!
ట్రెండింగ్
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!