Margani Bharat: మాజీ ఎంపీ ప్రచార రథాన్ని తగలబెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు..
- వైసీపీ మాజీ ఎంపీ ప్రచార రథాన్ని తగలబెట్టిన దుండగులు..
- అధికార పార్టీ నాయకులు గంజాయి.. బ్లేడ్ బ్యాచ్ని పెంచి పోషిస్తుంది..
- నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మార్గాని భరత్ రామ్ డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Margani Bharat: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ ఎన్నికల ప్రచార రథాన్ని గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం అర్ధరాత్రి తగలబెట్టారు. రాజమహేంద్రవరం నగరంలోని వీఎల్ పురంలో ఉన్న మార్గాని ఎస్టేట్స్‌లోని ఆయన కార్యాలయం దగ్గర ఈ వాహనం ఉంచారు. దీనికి గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టడంతో పూర్తిగా కాలిపోయింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు మార్గాని భరత్ కు సమాచారం అందించారు.
Read Also: SCO summit: కజకిస్తాన్ ఎస్‌సీఓ సమ్మిట్‌కి మోడీ బదులుగా జై శంకర్..
Also Read
- Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
- Nellore: వివాహేతర సంబంధం.. నిండు ప్రాణం బలి.!
- Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్‌పోర్టు మసీదు తరలింపు.!
- Israel-France: ఇజ్రాయెల్ మంత్రి బెన్-గ్విర్‌కు ఫ్రాన్స్ షాక్.. దేశంలోకి రాకుండా నిషేధం
ఇక, వెంటనే మాజీ ఎంపీ మార్గాని భరాత్ తో పాటు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా భరత్ రామ్ మాట్లాడుతూ.. రాజమహేంద్రవరంలో ఇలాంటి విష సంస్కృతి గతంలో ఎప్పుడూ లేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అధికార పార్టీ చేస్తున్న దాడుల నేపథ్యంలోనే ఈ దుశ్చర్యకు ఒడిగట్టి ఉంటారని మండిపడ్డారు. అధికార పార్టీ నాయకులు గంజాయి, బ్లేడ్ బ్యాచ్లను పెంచి పోషిస్తున్నారంటూ తాను ఎప్పటి నుంచో చెబుతున్నాను.. ఇలాంటి పరిస్థితి రాజమండ్రిలో ఏర్పడటం దారుణమని మార్గాని భరత్ అన్నారు.
Read Also: T20 World Cup 2024 Final : తుది సమరానికి వేళాయె.. నేడే సఫారీలతో సమరం..
కాగా, ఈ విషయాన్ని రాష్ట్ర డీజీపీ ద్వారాక తిరుమలరావు దృ ష్టికి తీసుకుని వెళ్లి.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతామని మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ పేర్కొన్నారు. ఇటీవల మోరంపూడి ఫ్లై ఓవర్ బ్రిడ్జి శిలాఫలకం ధ్వంసం, ఇళ్ల పైకి రాళ్లతో దాడులు, కోటిలింగాలపేటలో వైఎస్సార్ సీపీకి చెందిన యువకుడిపై దాడి చేయడం లాంటి దారుణాలకు పాల్పడుతున్నారనే విషయాన్ని ప్రజలు గమనించాలని ఆయన కోరారు. సీసీ కెమెరా ఫుటేజీ ద్వారా పోలీసులు పూర్తి విచారణ చేయాలని, నిందితులపై, ఈ ఘటనకు ఉసిగొల్పిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భరత్‌రామ్ డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!
-
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
-
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
-
OTR : పాలమూరు కాంగ్రెస్‌లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?