జాతీయ స్థాయి సినీ నటుడు అల్లు అర్జున్‌ను అరెస్టు చేయటం అక్రమమని రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ ఖండించారు. పుష్ప-2 విడుదల సందర్భంగా ఆకస్మికంగా తొక్కిసలాట ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ.. అల్లు అర్జున్ అరెస్ట్‌ను ఖండించారు.
Margani Bharat: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ ఎన్నికల ప్రచార రథాన్ని గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం అర్ధరాత్రి తగలబెట్టారు.
రాజకీయంగా బహుజనులు చైతన్యవంతులైనప్పుడే రాజ్యాధికారం సాధ్యమవుతుందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, ఎంపీ మార్గాని భరత్ రామ్, రాజమండ్రి లోక్‌సభ వైసీపీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ తదితర బీసీ సామాజిక ప్రముఖులు అభిప్రాయపడ్డారు. రాజమండ్రి వీఎల్ పురం మార్గాని ఎస్టేట్ ప్రాంగణంలో 'శెట్టిబలిజ, గౌడ ఆత్మీయ సమ్మేళనం' నిర్వహించారు. ఈ సభకు ఎంపీ భరత్ అధ్యక్షత వహించారు. రాజమండ్రి అర్బన్, రూరల్, రాజమండ్రి లోక్‌సభ స్థానాలను బీసీలకే సీఎం జగన్ కేటాయించడం శుభపరిణామమని మంత్రి చెల్లుబోయిన…
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి కేంద్ర ప్రభుత్వం కొత్త సంవత్సర కానుక పంపింది.. రాజమండ్రికి ఔటర్ రింగ్ రోడ్ మంజూరు చేసింది కేంద్ర సర్కార్.. ఈ విషయాన్ని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ వెల్లడించారు.. కేంద్రం ఉత్తర్వులపై ఆనందాన్ని వ్యక్తం చేసిన ఆయన.. ఈ సందర్భంగా ఓ ప్రకటన విడుదల చేశారు.. రాజమండ్రి అభివృద్ధికి కేంద్రం న్యూ ఇయర్ కానుక ఇచ్చిందన్నారు.. రాజమండ్రికి ఔటర్ రింగ్ రోడ్ మంజూరైంది.. కేంద్ర ఉపరితల రవాణా శాఖ నుంచి ఉత్తర్వులు…
ఏపీలో సినిమా టిక్కెట్ల వివాదం పై చాలా మంది ఫైర్ అవుతున్నారు.అయినా దీనిపై ఇప్పటి వరకు టాలీవుడ్ పెద్దలు స్పందించలేదు. ఇదిలా ఉంటే ఈ అంశంపై ప్రముఖులు తమైదైన రీతిలో ట్వీట్లు చేస్తున్నారు. మరో వైపు ఏపీలో ఈ టిక్కెట్ రేట్లతో థియేటర్లు నడపలేమంటూ మూసివేశారు. పెద్ద పెద్ద థియేటర్లన్ని మూత పడాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇప్పటికే టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి ప్రభుత్వాన్ని ఉద్దేశించి భారతి సిమెంట్‌ను రూ.100కే అమ్మండి అంటూ ట్వీట్ చేశారు.…
పోలవరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై లోకేష్ చేస్తున్న విమర్శలు హాస్యాస్పదంగా ఉన్నాయి. లోకేష్ తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు అని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ అన్నారు. 2016లో స్పెషల్ ప్యాకేజ్ లో భాగంగా పోలవరం అంచనాలు 20వేల కోట్లకు కుదిస్తే చంద్రబాబు సంతకాలు చేశారు. కానీ సీఎం జగన్ సూచనల మేరకు పోలవరం నిధల కోసం పార్లమెంటు సమావేశాలు స్తంభింపచేశాం. ఇటీవలే పోలవరం సవరించిన అంచనాలు 47వేల కోట్లకు కేంద్రం…