Maoist Letter : భద్రాచలం మెడికల్ మాఫియాకు మావోయిస్టుల హెచ్చరిక..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్ట్) భద్రాద్రి కొత్తగూడెం -అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ (బీకే-ఏఎస్ఆర్) కార్యదర్శి ఆజాద్ పేరిట లేఖను విడుదల చేశారు. ఈ లేఖలో ఖమ్మం జిల్లాలో మెడికల్ మాఫియా రెచ్చిపోతోందని.. ప్రజలు పట్టిపీడిస్తున్న వారు తమ వైఖరిని మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదని, ప్రజా కోర్టుల శిక్ష తప్పదని హెచ్చరించారు. లేఖలో ‘ మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన భద్రాచలం ఇప్పు డు మెడికల్ మాఫియాకు కాసులు కురిపిస్తుంది. పూర్తి ఏజెన్సీ ప్రాంతం కావడంతో గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని సంపాదనే ధ్యేయంగా ఆసుపత్రులు పనిచేస్తున్నా యి. ప్రజల ఆరోగ్యాన్ని బూచిగా చూపి వారిని భయబ్రాంతులకు గురిచేసి రోగుల రక్తం పిండుకుంటున్నా రు. ఛత్తీస్ఘడ్, ఒడిస్సా , ఆంధ్ర ప్రాంత గిరిజనులు, గిరిజనేతరులతో పాటు స్థానిక తెలంగాణ ప్రాంత ప్రజలను వైద్యం పేరుతో రోజుల తరబడి ఆసుపత్రుల్లో ఉం చి అవసరం లేకున్నా రకరకాల పరీక్షలు చేస్తూ ల్యాబులు, ఆసుపత్రులు, వైద్యులు ప్రజలను డబ్బు ల కోసం హింసిస్తున్నా రు. ప్రజల ప్రాణాలు ఇప్పుడు ఆసుపత్రులకు డబ్బులు కురిపించే అవకాశాలుగా మారాయి. ప్రజల నమ్మ కానికి తూట్లు పొడుస్తూ కొందరు వైద్యులు రాక్షసుల్లా తయారయ్యారు. పెద్దోళ్లు.. పేదోళ్ళ నే తేడాలు లేకుండా రోగుల రక్తం జలగల్లా పీల్చు తున్నారు.
Also Read : Puvvada Ajay Kumar : ఖమ్మంలో కొద్ది మంది పనికిమాలిన బ్యాచ్ ఉంది
Also Read
- Gudivada Amarnath: హోంమంత్రి గారు ఆ రోజు మహిళా లోకం గుర్తుకు రాలేదా?.. ఎక్కడైనా ఫిర్యాదు చేసుకోండి!
- Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి 'రాగి బన్ దోస' ఇంట్లోనే చేసేయండి ఇలా.!
- AP Weather Today: ఏపీకి వాతావరణ హెచ్చరిక.. ఆ రెండు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ!
- CM Revanth Reddy: భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉంది.. విద్యతోనే సమాజ మార్పు సాధ్యం.!
ఆరోగ్య సమస్యలను అలుసుగా చేసుకుని.. మనిషిలో రకరకాల పరీక్షల పేర్లతో భయాన్ని సృష్టిస్తూ ఆసుపత్రి గల్లలను కొల్లలుగా నింపుకుంటున్నారు. ప్రైవేటు ఆసుపత్రి మొదలుకొని ప్రభుత్వ ఆసుపత్రి వరకు కాసుల కక్కుర్తి మరిగిన వైద్యులు జనాలను పీడించుకుతింటున్నారు. ముఖ్యంగా భద్రాచలం ప్రభుత్వ వైద్యశాలలో పని చేసే వైద్యులు సైతం తమ సొంత క్లినిక్లకు ఎక్కు వ సమయాన్ని కేటాయిస్తు ప్రభుత్వ పనివేళలను విస్మరిస్తున్నారు. సమయానికి రోగికి అందించాల్సిన వైద్యాన్ని నిర్లక్ష్యం చేయడమే కాకుండా, ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగుల్లో లేనిపోని అబద్దపు అపోహలతో భయాన్ని పెంచి తమ సొంత క్లినిక్స్ ని తరలించుకుంటున్నా రు. ప్రధానంగా మెడికల్ మాఫియాగా మారిన వైద్య వృత్తి ఫార్మ కంపెనీలతో జతకడుతూ తక్కు వ ధరకు అమ్మా ల్సిన మందులను బ్రాండుల పేర్లతో ఎక్కు వ ధరలకు అమ్ము కుంటున్నా రు. ఇక్కడి వైద్యులు మనుషులకి కరెన్సీ నోట్లు ముద్ర వేసే యంత్రాల్లా భావిస్తూ నోటికి వచ్చి న టెస్టుల పేర్లు చెప్తూ.. చేతికి వచ్చిన ఖరీదైన మందుల పేర్లు రాస్తూ పేద ప్రజలను రాబందుల్లా పీక్కుతిం టున్నారు.
భద్రాచలం మెడికల్ మాఫీయాకు హెచ్చరిక..!
ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే వైద్యు లు వారి సమయాన్ని పూర్తిగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేటాయిం చకుం డా ఇలానే ప్రవర్తిస్తే తగినమూల్యం చెల్లిం చుకోవాల్సి వస్తుం ది. గిరిజన ప్రాం తమైన భద్రాచలం ప్రాం తం లో సం పాదనే ధ్యే యం గా ప్రైవేటు ఆసుపత్రులను ఏర్పా టు చేసి ఈ ప్రాం తం లో నివసిం చే గిరిజనుల అమాయకత్వా న్ని అసరా చేసుకొని కోట్లకు పడగేత్తిన వైద్యు లు, ల్యా బ్, మెడికల్ షాప్ ల యజమానులు తమ పద్ధతిని మర్చు కొక పోతే ప్రజకొర్టు లో శిక్ష తప్ప దు.’ అని లేఖలో పేర్కొన్నారు.

01 (2)
తాజావార్తలు
-
FIFA World Cup 2026 : టాప్ 7 హయ్యేస్ట్ పెయిడ్ ప్లేయర్స్… ఆటలో ఒక్కొక్కరి సంపాదన వందల కోట్లు
-
Gudivada Amarnath: హోంమంత్రి గారు ఆ రోజు మహిళా లోకం గుర్తుకు రాలేదా?.. ఎక్కడైనా ఫిర్యాదు చేసుకోండి!
-
Dia Mirza : ప్రకృతి వనరులను అమ్మాయిలా వాడుకుని వదిలేయకండి.. నాగ్ హీరోయిన్ కామెంట్స్
-
Keerthy Suresh : కీర్తి సురేష్ కోర్ట్‌రూమ్ డ్రామా రిలీజ్ డేట్ ఫిక్స్ …
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
ట్రెండింగ్
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!
-
Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్‌కు పండగే.. 12 గంటల పాటు నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్!
-
8560mAh భారీ బ్యాటరీ, 6000 నిట్స్ డిస్ప్లే, IP69K రక్షణతో HONOR X70 Pro Max లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 7540mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI Turbo 5 లాంచ్.! ధర ఎంతంటే.?