Maoist Party: పోలీసులే విషమిచ్చి చంపారు.. 9న రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌కు పిలుపు
- పోలీసులపై మవోయిస్టు పార్టీ ఆరోపణలు
- డిసెంబర్ 1న ములుగులో విష ప్రయోగం
- తాజాగా ప్రెస్‌నోట్ విడుదల చేసిన పార్టీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ద్రోహి ఇచ్చిన సమాచారంతో డిసెంబర్ 1వ తేదీన ములుగు జిల్లా, ఏటూర్ నాగారం మండలం, చల్చాక గ్రామ పంచాయితీ అడవు పోల్ కమ్మ వాగు వద్ద తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసులు ఏడుగురి విప్లవకారులకు విషమిచ్చి అతి కిరాతకంగా చంపారని భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆరోపించింది. ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. “నవంబర్ 30వ సాయంత్రం ఏడుగురితో ఉన్న తమ దళం వలస ఆదివాసీ గ్రామాన్ని కలిసి నమ్మిన వ్యక్తికి తినడానికి భోజనాలు ఏర్పాటు చేయమని చెప్పాం. ముందుగానే పోలీసులకు అప్లోవర్ గా మారిన ఇన్ఫార్మర్ ద్వారా భోజనంలో విషం ఇచ్చి స్పృహ కోల్పోయే లాగా చేశారు. స్పృహ కోల్పోయిన కామ్రేడ్స్ ను పట్టుకుని చిత్రహింసలు పెట్టి తెల్లవారు జామున 4 గంటలకు అతి సమీపం నుంచి కాల్చి చంపారు. శత్రువు పథకంలో చిక్కి అమూల్యమైన కామ్రేడ్స్ ప్రాణాలర్పించారు. ప్రజల కోసం ప్రాణాలర్పించిన అమరులకు పేరు పేరున తెలంగాణ రాష్ట్ర కమిటీ విప్లవ జోహార్లు అర్పిస్తోంది.” అని పేర్కొన్నారు.
READ MORE: Sukumar: రాజమౌళి’ భయపడినంతా అయ్యింది.. సరైనోడు తగిలాడు.. ‘సుకుమార్’ మెంటల్ మాస్!
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
అంతే కాకుండా చనిపోయిన కామ్రేడ్స్ పేర్లను కూడా ప్రెస్‌నోట్‌లో పేర్కొన్నారు. “కాంగ్రెస్ ప్రభుత్వం జరిపిన పాశవిక హత్యకాండను తీవ్రంగా ఖండిస్తూ డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర కమిటీ రాష్ట్ర వ్యాప్త బంద్ పిలుపునిస్తున్నది. యావత్ పీడత ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, విద్యాలయాలు, తదితర వ్యాపార సంస్థలు బందును పాటించి జయ ప్రదం చేయాలని కోరుతోంది. ఈ ఘటనకు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నాయకులు పూర్తి బాధ్యత వహించాలి. ఘటనపై న్యాయ విచారణ జరిపి.. బాధ్యులైన పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్పోరేట్లకు అత్యంత విశ్వాసంగా కొమ్ముకాస్తుంది. వారి లాఖ కోసమే దోపిడి విధానాలను అమలు చేస్తున్నది. అందులో భాగంగానే ప్రజా వ్యతిరేక విధానాలకు అడ్డంకిగా మారిన ప్రజా ఉద్యమాల అణిచివేయడానికి ప్రజా పోరాటాలకు నాయకత్వం వహిస్తున్న మావోయిస్టు పార్టీని, పార్టీ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ కగార్ కొనసాగిస్తున్నారు. దామెరతోగు, రఘునాథపాలెం, పోల్ కమ్మ వాగు వంటి వరుస ఎన్ కౌంటర్ల పేరుతో హత్యలకు పాల్పడుతున్నారు. ఈ పార్టీ కొనసాగిస్తున్న ఈ పాశవిక దాడులను ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, మేధావులు తీవ్రంగా ఖండించాలని కోరుతున్నాము.” అని పత్రికా ప్రకటనలో రాసుకొచ్చారు.
తాజావార్తలు
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!