Site icon NTV Telugu

Maoists : ఆపరేషన్ కగార్ దాడిని ఖండిస్తూ జూన్ 20న బంద్‌కు మావోయిస్టుల పిలుపు

Maoists

Maoists

Maoists : తెలుగు రాష్ట్రాల్లో ఈనెల 20న బంద్‌కు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఇటీవల జరిగిన ఆపరేషన్ కగార్ దాడిని ఖండిస్తూ ఈ బంద్‌ను ప్రకటించినట్లు మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ పేరుతో ఒక ప్రకటన విడుదలైంది. ప్రకటనలో ప్రకారం, జూన్ 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకూ జరిగిన ఆపరేషన్ కగార్ పేరుతో నేషనల్ పార్క్ పరిధిలో చేపట్టిన దాడుల్లో రాష్ట్ర స్థాయి కీలక నాయకులైన కామ్రేడ్ టీఎల్ఎన్ఎస్ చలం అలియాస్ ఆనంద్, కామ్రేడ్ మైలారపు అడెల్ అలియాస్ భాస్కర్ సహా 7 మంది మావోయిస్టులను పోలీసులు హత్య చేశారని మావోయిస్టులు ఆరోపించారు.

కామ్రేడ్ గౌతం, భాస్కర్ వంటి 30 ఏళ్ల విప్లవ అనుభవం కలిగిన నాయకులు ఈ ఆపరేషన్‌లో అమరులయ్యారని పేర్కొన్నారు. గౌతం విజయవాడలోని ఆయుర్వేద మెడికల్ కళాశాలలో విద్యార్ధిగా ఉండగా, ఆర్‌ఎస్‌యూ ద్వారా ఉద్యమంలో చేరారు. 1981లో పూర్తిస్థాయి కార్యకర్తగా మారి, పలు ప్రాంతాల్లో మావోయిస్టు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. భాస్కర్ అదిలాబాద్ డివిజన్‌లోని పలు గ్రామాల్లో పనిచేసి, రాష్ట్ర కమిటీ స్థాయికి ఎదిగారు.

Star Heroine: సీన్ కోసం 15 మంది పురుషుల ముందు నగ్నంగా నిలబడ్డాను..

ప్రభుత్వ బలగాలు ఈ దాడుల్లో విప్లవకారులను అణిచివేయాలనే లక్ష్యంతో ముందుకు సాగాయని మావోయిస్టులు విమర్శించారు. కార్పొరేట్ శక్తులకు లబ్ధి కలిగించే విధంగా అడవుల్లోని ఆదివాసీలపై దాడులు కొనసాగుతున్నాయని ఆరోపించారు.

చర్చలకు తమ పార్టీ ఎప్పుడూ సిద్ధంగా ఉన్నప్పటికీ, గతంలో చర్చల నిమిత్తం వచ్చిన తమ ప్రతినిధి కామ్రేడ్ స్టధాకర్‌ను కూడా ప్రభుత్వం హత్యచేసిందని పేర్కొన్నారు. ప్రభుత్వం శాంతి చర్చల పేరుతో ప్రజలను మోసం చేస్తోందని, వాస్తవిక లక్ష్యం విప్లవ ఉద్యమాన్ని అణచివేయడమేనని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, ప్రభుత్వ అణచివేత చర్యలకు నిరసనగా జూన్ 20న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంద్ పాటించాలని ప్రజలకు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది.

Re-Release : మరో లవ్ అండ్ రొమాంటిక్ మూవీ..రీ రిలీజ్

Exit mobile version