Maoists : తెలుగు రాష్ట్రాల్లో ఈనెల 20న బంద్‌కు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఇటీవల జరిగిన ఆపరేషన్ కగార్ దాడిని ఖండిస్తూ ఈ బంద్‌ను ప్రకటించినట్లు మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ పేరుతో ఒక ప్రకటన విడుదలైంది. ప్రకటనలో ప్రకారం, జూన్ 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకూ జరిగిన ఆపరేషన్ కగార్ పేరుతో నేషనల్ పార్క్ పరిధిలో చేపట్టిన దాడుల్లో రాష్ట్ర స్థాయి కీలక నాయకులైన కామ్రేడ్ టీఎల్ఎన్ఎస్ చలం అలియాస్ ఆనంద్, కామ్రేడ్…