ప్రజంట్ తెలుగు స్టేట్స్‌లో కొత్త సినిమాలు లేక పాత సినిమాలే మళ్ళీ థియేటర్స్ లో రాజ్యమేలుతున్నాయి. గతంలో విడుదలై ఘన విజయాలు సాధించిన సినిమాలను, కొత్త టెక్నాలజీలోకి మార్చి మరి రీమోడల్ చేసి హీరోల పుట్టినరోజులు, పండగలకి మళ్లీ విడుదల చేస్తున్నారు. దీంతో ఫ్యాన్స్ హంగామా మామూలుగా ఉండటం లేదు. ఇందులో భాగంగా తాజాగా మరో క్లాసిక్ అండ్ రొమాంటిక్ లవ్ స్టోరీ ‘ఏమాయ చేసావే’ కూడా రీ రిలీజ్ కానుంది.
Also Read : Shraddha : మరో అద్భుతమైన బయెపిక్‌తో రాబోతున్న స్టార్ హీరోయిన్..
నాగచైతన్య హీరోగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం. ఎటువంటి అంచనాలు లేకుండా 2010 ఫిబ్రవరి 26న విడుదలైన ఈ సినిమాకి, మొదట నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ.. తర్వాత యూత్ ఎగబడి చూశారు. ఇందిరా ప్రొడక్షన్స్ సంస్థ పై, మహేష్ సోదరి ఘట్టమనేని మంజుల నిర్మించిన ఈ చిత్రంతో, హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిని సమంత తన అందం నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. అక్కడి నుంచి మొదలు సామ్ కెరీర్ పరంగా వెన్నక్కి తిరిగి చూసుకోలేదు. ఈ మూవీకి సంబంధించిన మాటలు నేటికి ఇష్టంగా వింటుంటారు. ఇక తాజాగా జూలై 18న ఈ మూవీ రీ రిలీజ్ కాబోతున్నట్లు మోకర్స్ తెలిపారు. అలాగే సామ్ చై కి సంబంధించిన రొమాంటిక్ పిక్ కూడా షేర్ చేశారు.