Daggubati Purandeswari: బీజేపీలో చేరిన పలువురు వైసీపీ నేతలు.. ఎన్డీఏ కూటమితోనే ప్రగతి సాధ్యం..
- బీజేపీలో చేరిన రాయలసీమ జిల్లాలకు చెందిన పలువురు వైసీపీ నేతలు..
- పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించిన పురంధేశ్వరి..
- దేశ ప్రగతి NDA కూటమితోనే సాధ్యం..
- మూడోసారి ప్రజలు అవకాశం ఇవ్వడానికి కారణం మోడీ చేసిన సంక్షేమమే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Daggubati Purandeswari: బీజేపీ చీఫ్ పురంధేశ్వరి సమక్షంలో పలువరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.. అనతరపురం, రాజంపేట, సత్యసాయి జిల్లాలకు చెందిన పలువురు వైసీపీ నేతలు పురంధేశ్వరి సమక్షంలో బీజేపీ గూటికి చేరారు.. వారికి పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు పురంధేశ్వరి.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీజేపీ పదేళ్లుగా దేశ ప్రజల కోసం పని చేస్తోంది.. దేశ ప్రగతి NDA కూటమితోనే సాధ్యం అన్నారు.. మూడోసారి ప్రజలు అవకాశం ఇవ్వడానికి కారణం ప్రధాని నరేంద్ర మోడీ చేసిన సంక్షేమమే అన్నారు.. రాష్ట్రంలో గత ఐదేళ్లలో ప్రజలు పడిన ఇబ్బందులు పోవాలనే కూటమి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు.. చంద్రబాబు ప్రజాహిత పాలనను రాష్ట్రంలో అందిస్తారని వెల్లడించారు పురంధేశ్వరి..
Read Also: CM Chandrababu: భారీ వర్షాలు, వరదలపై సీఎం సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు
Also Read
- Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
- Ajit Agarkar: మనసు మార్చుకున్న అజిత్ అగార్కర్.. తుది నిర్ణయం బీసీసీఐకి వెల్లడి...
- Imran Khan: ‘‘బ్రిటన్ జోక్యం చేసుకోవాలి’’.. ఇమ్రాన్‌ఖాన్‌పై యూకే మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
- Polavaram District: పోలవరం జిల్లాలో తీవ్ర విషాదం.. పురాతన బావిలో మృతదేహం..
మరోవైపు, రాష్ట్రంలో పలు జిల్లాలో భారీ వర్షాలు, వరద ఉధృతం అవుతోంది గనుక కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు పురంధేశ్వరి.. అధికారులు ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.. ఐదేళ్ల వైసిపి అరాచక పాలనని ప్రజలు చూశారు.. 16 సంవత్సరాల బీసీ అమ్మాయి ఆమె అక్క మీద దౌర్జన్యం చేస్తున్నారని అడిగితే ఆమెను కిరాతకంగా చంపారు.. దీనిపై స్పందించలేదు… ఉత్తరాంధ్రలో డాక్టర్ ఆక్సిజన్ కొరత ఉందని కరోనా సమయంలో ప్రశ్నిస్తే తీవ్ర ఇబ్బందులు పెట్టారు.. లోకల్ బాడీ ఎన్నికల్లో నామినేషన్ వేయటానికి వెళ్ళిన అభ్యర్థుల చేతుల్లో ఉన్న నామినేషన్ పత్రాలు చింపేశారు.. నెల్లూరులో కత్తులతో ఓ మహిళ కార్యకర్తని గాయపరిచారు. లేఖ రాయడం కాదు గుండెలపై చేయి వేసుకొని వైఎస్ జగన్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవు పలికారు.
Read Also: Yogi Adityanath: కన్వర్ యాత్ర మార్గంలో హోటళ్లకు నేమ్‌బోర్డులు ఉండాల్సిందే..
ఇక, కేంద్ర ప్రభుత్వ సహాయం లేనిదే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యం కాదు అన్నారు పురంధేశ్వరి.. మెడ్ టెక్ పార్క్ నిర్మాణంలో జితేంద్ర సింగ్ స్వయంగా జగన్ నుండి సహకారం లేదని చెప్పారు.. నితిన్ గడ్కరీ సహకారంతోనే చేశామని స్వయంగా చెప్పారు.. బీజేపీ సింహ భాగస్వామ్యం లేనిది రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని స్పష్టం చేశారు.. గతంలో వైఎస్ జగన్ సర్కార్‌కు కేంద్ర ప్రభుత్వ సహకార నిరాకరణపై పేర్ని నాని విఫులంగా చెప్పాలని డిమాండ్ చేశారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి..
తాజావార్తలు
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
-
Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
-
Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
-
Ajit Agarkar: మనసు మార్చుకున్న అజిత్ అగార్కర్.. తుది నిర్ణయం బీసీసీఐకి వెల్లడి…
-
Harish Rao: ఎల్‌నినో కాదు.. కాంగ్రెస్ చేతకానితనమే కరువుకు కారణం
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!