Polavaram District: పోలవరం జిల్లాలో తీవ్ర విషాదం.. పురాతన బావిలో మృతదేహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇందుకూరుపేట పల్లపు వీధిలో పొలాల మధ్య ఉన్న పురాతన నేల బావిలో ప్రమాదవశాత్తు పడి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని చచిన్నాయపాలెం గ్రామానికి చెందిన బేలం వెంకన్నగా గుర్తించారు. ఈ దుర్ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పోలవరం జిల్లా పరిధిలోని దేవీపట్నం మండలం, ఇందుకూరుపేట పల్లపు వీధి పరిసర ప్రాంతంలో ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. స్థానిక పొలాల మధ్య ఉన్న పురాతన నేల బావిలో ఓ వ్యక్తి మృతదేహం కనిపించడంతో స్థానికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు వేగంగా ఘటనాస్థలికి చేరుకున్నారు. బావిలో ఉన్న మృతదేహాన్ని పరిశీలించి, మృతుడిని చచిన్నాయపాలెం గ్రామానికి చెందిన బేలం వెంకన్నగా నిర్ధారించారు.
Also Read
- Hanuman Ansh: తెలుగు రిలీజ్‌తో భారీ బూస్ట్.. 64వ రోజున 60 శాతం పెరిగిన ‘హనుమాన్ అంశ్’ కలెక్షన్లు!
- Delhi Protest: రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్, క్షుణ్ణంగా తనిఖీలు.. దద్దరిల్లుతున్న రాజధాని నగరం..
- Shreyas Iyer Records: అయ్యో అయ్యర్.. నీకే ఎందుకిలా.? ఖాతాలో అరుదైన చెత్త రికార్డు..!
- IND vs SL: భారత్-శ్రీలంక సిరీస్‌లో కీలక మార్పు.. మ్యాచ్ వేదిక తరలింపు.? అసలేమైంది..
వెంకన్న ఆ బావిలో ఎలా పడిపోయారనే అంశంపై స్థానికులతో పాటు పోలీసులు ఆరా తీశారు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా? లేక దీని వెనుక మరేదైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు కూలంకషంగా దర్యాప్తు చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, అన్ని కోణాలలోనూ విచారణను కొనసాగిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత వెంకన్న మృతికి అసలు కారణాలు స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది.
- Tags
- ACCIDENT
- Devipatnam
- NEWS
- polavaram
తాజావార్తలు
-
Hanuman Ansh: తెలుగు రిలీజ్‌తో భారీ బూస్ట్.. 64వ రోజున 60 శాతం పెరిగిన ‘హనుమాన్ అంశ్’ కలెక్షన్లు!
-
Delhi Protest: రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్, క్షుణ్ణంగా తనిఖీలు.. దద్దరిల్లుతున్న రాజధాని నగరం..
-
Shreyas Iyer Records: అయ్యో అయ్యర్.. నీకే ఎందుకిలా.? ఖాతాలో అరుదైన చెత్త రికార్డు..!
-
IND vs SL: భారత్-శ్రీలంక సిరీస్‌లో కీలక మార్పు.. మ్యాచ్ వేదిక తరలింపు.? అసలేమైంది..
-
Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!