Harish Rao: ఎల్‌నినో కాదు.. కాంగ్రెస్ చేతకానితనమే కరువుకు కారణం
- ఎల్‌నినోపై ప్రభుత్వ వాదనకు హరీష్ రావు కౌంటర్
- శ్రీశైలం నీటి వినియోగంపై ఉత్తమ్‌కు సవాల్
- నీళ్లు ఉన్నా తోడుకోలేకపోతున్నారంటూ విమర్శ
- రైతులను ఆదుకోవడంపై ప్రభుత్వాన్ని నిలదీసిన హరీష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ శాసనసభలో సాగునీరు, ఎల్ నినో పరిస్థితులపై జరిగిన చర్చపై బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి ప్రకృతి తెచ్చిన కష్టం కాదని, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వచ్చిన మానవ నిర్మిత కరువని ఆరోపించారు. కేసీఆర్‌తో కలిసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న బాధ్యతాయుతమైన నాయకుడిగా తాను ఈ విషయాలను ఆధారాలతో సహా నిరూపిస్తానని స్పష్టం చేశారు.
అసెంబ్లీ సాక్షిగా అసత్యాలు.. మంత్రి ఉత్తమ్‌పై మండిపాటు
కృష్ణా జలాల వినియోగంపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో తప్పుడు గణాంకాలు చెప్పారని హరీష్ రావు విమర్శించారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి తెలంగాణ 80 టీఎంసీలకు పైగా నీటిని వాడుకుందని చెప్పడం శుద్ధ అబద్ధమని కొట్టిపారేశారు. శ్రీశైలం నుంచి నీటిని తోడేందుకు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ఒక్కటే మార్గమని, అక్కడ కేవలం 8 టీఎంసీలు మాత్రమే ఎత్తినప్పుడు, మిగతా 80 టీఎంసీల నీళ్లు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. చేతనైతే ఆ నీళ్లను రైతుల పొలాల్లో ఎక్కడ వాడారో సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు.
Also Read
చేతకానితనంతోనే నీటి సంక్షోభం
కృష్ణా నదిలో తెలంగాణ వాటాను సరిగ్గా వాడుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని హరీష్ రావు ఆరోపించారు. శ్రీశైలంలో సరిపడా నీళ్లు ఉన్నప్పటికీ, కల్వకుర్తి వద్ద ఐదు మోటార్లకు గాను కేవలం రెండు మోటార్లను మాత్రమే నడుపుతున్నారని మండిపడ్డారు. నీళ్లు ఉన్నా తోడుకోలేని చేతకానితనంతో ప్రభుత్వం వ్యవహరిస్తోందని, తమ వైఫల్యాన్ని ఎల్ నినో , ప్రకృతిపై తోసివేసి చేతులు దులుపుకోవాలని చూస్తోందని ధ్వజమెత్తారు.
రైతుల సమస్యలను వదిలి రాజకీయ కుట్రలు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంత తక్కువ పరిమాణంలో నీటి వినియోగం జరగడం ఇదే తొలిసారి అని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ప్రతిపక్షాలపై దాడులు చేయడం, రాజకీయ కుట్రలు పన్నడంపైనే దృష్టి పెడుతోందే తప్ప, ఎండిపోతున్న పంటలకు, అల్లాడుతున్న రైతులకు నీళ్లందించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుని తక్షణమే రైతాంగాన్ని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
DIGGER : హాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా ‘డిగ్గర్’
-
Nana Patekar: తరతరాలను అలరించిన గొప్ప నటుడు.. నానా పటేకర్‌కు గబ్బర్, జింక్స్ నివాళులు!
-
Delhi Police: రాహుల్, ప్రియాంక గాంధీలపై FIR.. అసలు కాంగ్రెస్ నిరసనలో ఏం జరిగింది?
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
Hindi on Medicine Covers: తమిళం, ఇంగ్లిష్తో పాటు హిందీ.. మందుల కవర్లపై రగడ, ఆసుపత్రుల్లో పంపిణీ నిలిపివేత
ట్రెండింగ్
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?