Game Changer : గేమ్ చేంజర్ కొత్త షెడ్యూల్ మొదలయ్యేది అప్పుడేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ అప్‌డేట్ ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది.రాంచరణ్ 15 వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ రాంచరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది., అలాగే హీరోయిన్ అంజలి కూడా ముఖ్య పాత్రలో నటిస్తుంది.. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ అప్‌డేట్ ఒకటి నెట్టింట హల్‌చల్ చేస్తోంది.కొన్ని రోజులపాటు ప్లాన్ చేసిన గేమ్ ఛేంజర్ కొత్త షెడ్యూల్ వచ్చే వారంలో షురూ కానున్నట్టు తెలుస్తుంది.. రాంచరణ్‌తోపాటు మిగతా స్టార్ క్యాస్ట్ తో వచ్చే టాకీ పార్ట్‌ను ఈ షెడ్యూల్‌లో పూర్తి చేయాలని ఫిక్సయినట్టు సమాచారం..
ఈ షెడ్యూల్ గురించి శంకర్ టీం త్వరలోనే మరిన్ని వివరాలు తెలియజేయనుంది.మొత్తానికి వేగంగా షూటింగ్ పూర్తి చేస్తూ.. అభిమానులకు వరుస ప్రమోషనల్ అప్‌డేట్స్ ఇచ్చేందుకు రాంచరణ్ రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది.పొలిటికల్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు హ్యారీ జోష్ విలన్‌గా నటిస్తున్నారు… అలాగే ఎస్‌జే సూర్య, నవీన్ చంద్ర, శ్రీకాంత్, సముద్రఖని, జయరాయ్, సునీల్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.. గేమ్ ఛేంజర్ సినిమాకు కార్తీక్ సుబ్బరాజు కథను అందించారు. అలాగే సాయిమాధవ్ బుర్రా ఈ సినిమాకు డైలాగ్స్ అందిస్తున్నారు.తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు..గేమ్ ఛేంజర్ లో కొన్ని కీలక సన్నివేశాలను కొన్ని రోజుల క్రితం స్టంట్ మాస్టర్ అన్బరివ్ నేతృత్వంలో మైక్రోబాట్ కెమెరాతో యాక్షన్ సీక్వెన్స్ షూట్‌ను పూర్తి చేశారు. ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవి కానుకగా గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.
Also Read
- India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్‌పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
- AFG vs IND: నేడే భారత్-ఆఫ్ఘాన్ మ్యాచ్.. బుడ్డోడిని ఆడిస్తారా?.. లైవ్ స్ట్రీమింగ్, టైమ్, జట్ల పూర్తి వివరాలు ఇవే..
- OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
- Bangladesh: బంగ్లాదేశ్‌కు భారత్ ‘‘కరెంట్ షాక్’’..
తాజావార్తలు
-
BRICS Summit 2026: BRICSకి 20 ఏళ్లు.. ప్రత్యేక స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన భారత్.. వీటి ప్రత్యేకత ఇదే
-
Samantha: బేబీ బంప్‌తో సమంత కొత్త ఫోటోలు.. ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోతున్న సామ్!
-
Vivo X Fold 6: వివో X Fold 6 త్వరలో మార్కెట్లోకి.. Geekbenchలో లిస్టింగ్.. 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీ
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Idol Cleaning Tips : గణేష్ చతుర్థికి ఇంట్లోనే విగ్రహాలకు ఇలా కొత్త మెరుపు
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!