దేశ రాజధాని ఢిల్లీలో పట్టపగలు గ్యాంగ్‌స్టర్లు రెచ్చిపోయారు. జనాలతో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలోనే ఏ మాత్రం భయం లేకుండా ముఠా సభ్యులు బరితెగించారు. వెస్ట్ ఢిల్లీలోని ఓ షోరూమ్‌లోకి ప్రవేశించి ఇష్టానురీతిగా గాల్లోకి కాల్పులు జరిపి భయభ్రాంతులకు గురిచేశారు.
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌పై ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ దృష్టి సారించింది. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠాకు చెందిన మరో ఏడుగురు షూటర్లను అరెస్ట్ చేసింది. షూటర్లందరినీ పంజాబ్, ఇతర రాష్ట్రాల నుంచి అరెస్టు చేశారు. కాల్పులు జరిపిన వారి నుంచి ఆయుధాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పారిస్ ఒలింపిక్స్‌లో భారత జోడీ మను భాకర్.. సరబ్జోత్ సింగ్ చరిత్ర సృష్టించారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ షూటింగ్ ఈవెంట్‌లో మను, సరబ్జోత్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు.
వావ్ మను భాకర్, వావ్ సరబ్జోత్ సింగ్... వీరిద్దరూ పారిస్ ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో భారత్‌కు చెందిన మను భాకర్, సరబ్జోత్ సింగ్.. ఓహ్ యే జిన్, లీ వోన్హోలను ఓడించి కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు.