Manisharma : పవన్ కళ్యాణ్ వల్లే ఆ మ్యూజిక్ అంత బాగా వచ్చింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన చేసే ప్రతీ సినిమాలో కూడా అన్నీ విభాగాల్లో తన మార్కు ఉండేలా అయితే చూసుకుంటాడు.చాలామందికి పవన్ కళ్యాణ్ దర్శకత్వం వహించిన ఏకైక సినిమా ‘జానీ’ ఒక్కటే అని అనుకుంటూ ఉంటారు. కానీ తెలియని విషయం ఏమిటంటే ‘తమ్ముడు’ మరియు ‘ఖుషి’ సినిమాలకు కూడా దర్శకత్వ పర్యవేక్షణ చేసాడు పవన్ కల్యాణ్. ఈ విషయాన్నీ స్వయంగా ఆయన ప్రాణ స్నేహితుడు మరియు ఆర్ట్ డైరెక్టర్ అయిన ఆనంద్ సాయి ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. ఇక గుడుంబా శంకర్ కి పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్లే అందించిన విషయం అందరికీ తెలిసిందే, ఈ చిత్రానికి వీర శంకర్ దర్శకత్వం వహించాడు. కానీ కేవలం స్క్రీన్ నేమ్ మాత్రమే వీర శంకర్ ది అని కానీ దర్శకత్వం వహించింది పవన్ కళ్యాణ్ అని ఆయన చెప్పుకొచ్చాడు.ఈ సినిమాకి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఆ చిత్రానికి సంగీత దర్శకుడిగా పనిచేసిన మణిశర్మ ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడని తెలుస్తుంది..
నా సినిమా కెరీర్ లో బెస్ట్ ఆల్బం ఏది అంటే ‘గుడుంబా శంకర్’ అనే చెప్తాను. ఒక సినిమాలో ఇన్ని రకాల జానర్స్ ని నేను ఇప్పటి వరకు ట్రై చేయలేదు.. ఇదంతా పవన్ కళ్యాణ్ దగ్గరుండి నాతో చేయించుకున్నాడు, ఒక్కమాటలో చెప్పాలంటే ఈ సినిమాకి అస్సలైన సంగీత దర్శకుడు గా పవన్ కళ్యాణ్ పని చేసాడు.రాత్రి పగులు తేడా లేకుండా ఆయన నా రికార్డింగ్ రూమ్ లోనే ఉంటూ ప్రతీ చిన్న డిటైలింగ్ ని కూడా అడిగి తెలుసుకొని తన ఇష్టానికి తగ్గట్టుగా మ్యూజిక్ ని కంపోజ్ చేయించుకునే వాడు.. అందుకే ఈ సినిమాకి సంగీత దర్శకుడి క్రెడిట్స్ మొత్తం నేను ఆయనకే ఇస్తాను అంటూ మణిశర్మ అప్పట్లో చేసిన కామెంట్స్ సోషల్ మీడియా లో బాగా వైరల్ గా మారాయి. అంతే కాదు పవన్ కళ్యాణ్ లో గొప్ప గాయకుడు కూడా ఉన్నాడనే విషయం కూడా అందరికీ తెలిసిందే. తమ్ముడు , ఖుషి, జానీ, అత్తారింటికి దారేది మరియు అజ్ఞాతవాసి వంటి సినిమాల్లో ఆయన పాటలు పాడాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ హీరో గా నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ లో కూడా ఒక పాట పాడబోతున్నాడని ఒక వార్త వినిపిస్తుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం రావాలి.. ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తాను చేస్తున్న సినిమాలన్నీటికీ కూడా బ్రేక్ ఇచ్చి ఈ నెల 14 వ తేదీ నుండి వారాహి యాత్ర చెయ్యబోతున్నాడని సమాచారం.. మళ్ళీ జూన్ 26 వ తేదీ నుండి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రెండవ షెడ్యూల్ లో పాల్గొనబోతున్నాడని తెలుస్తుంది.
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
తాజావార్తలు
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!