True Lover : ఓటీటీ లోకి రాబోతున్న ఎమోషనల్ లవ్ స్టోరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మణికందన్, శ్రీ గౌరిప్రియ హీరోహీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ ట్రూ లవర్..ఈ చిత్రానికి ప్రభురామ్ వ్యాస్ దర్శకత్వం వహించాడు. తమిళంలో లవర్ పేరుతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీని తెలుగులో ట్రూ లవర్‌గా డైరెక్టర్ మారుతి మరియు బేబీ ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్ కలిసి రిలీజ్ చేశారు.యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు ప్రభురామ్ వ్యాస్ ఈ మూవీని తెరకెక్కించాడు. కాలేజీ రోజుల నుంచి అరుణ్ (మణికందన్), దివ్య (శ్రీగౌరిప్రియ) ప్రేమించుకుంటారు. ప్రతి విషయంలో దివ్యను అనుమానిస్తుంటాడు అరుణ్. ఆమె మరొకరితో క్లోజ్‌గా మాట్లాడినా అస్సలు సహించలేడు. అరుణ్ ప్రవర్తనకు విసిగిపోయిన దివ్య అతడికి బ్రేకప్ చెప్పాలని ఎన్నో సార్లు అనుకుంటుంది.
దివ్య తన ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్లిన ఓ టూర్‌కు ఆమె వెంట అరుణ్ కూడా వెళతాడు..అక్కడ ఏం జరిగింది..అరుణ్‌లో మార్పు వచ్చిందా..దివ్య ప్రేమను అర్థం చేసుకున్నాడా.. అన్నదే ఈ మూవీ కథ. అపనమ్మకం మరియు అభద్రతా భావంతో కూడిన ఏ ప్రేమ నిలబడదనే పాయింట్‌తో దర్శకుడు ప్రభురామ్ వ్యాస్ ఈ సినిమాను తెరకెక్కించాడు.
ట్రైలర్ మరియు టీజర్స్‌తో ఈ మూవీ తెలుగు ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలిగించింది. కానీ కథలో కొత్తదనం లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద పెద్దగా సందడి చేయలేకపోయింది. తమిళంలో మాత్రం డీసెంట్ కలెక్షన్స్ రాబడుతోంది.తమిళంలో లవర్ మూవీ రజనీకాంత్ లాల్ సలామ్ కలెక్షన్స్‌ను బీట్ చేసింది. ఆరు రోజుల్లో ఈ మూవీ పది కోట్ల వరకు గ్రాస్, నాలుగున్నర కోట్ల షేర్‌ను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.. ట్రూ లవర్‌లో నటించిన శ్రీ గౌరిప్రియ తెలుగు అమ్మాయి కావడం విశేషం. ఈ భామ వైజయంతీ మూవీస్‌లో వచ్చిన ‘మెయిల్ ‘మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది . ఇటీవలే ఈ భామ మ్యాడ్ మూవీ తో తెలుగులో పెద్ద హిట్ అందుకున్నది. ఇదిలా ఉంటే ట్రూ లవర్ మూవీ థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా తమిళం మరియు తెలుగు స్ట్రీమింగ్ రైట్స్‌ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ దక్కించుకున్నట్లు సమాచారం.ఎమోషనల్ లవ్ స్టోరీ గా రూపొందిన ట్రూ లవర్ మూవీ మార్చి 8 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం.. మార్చి ఫస్ట్ వీక్‌లో ఓటీటీ రిలీజ్ డేట్‌కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు తెలుస్తుంది.
Also Read
- Trump: ఒప్పందం కుదుర్చుకోండి.. లేదంటే నరకానికి పంపిస్తాం.. ప్రపంచ నేతల ముందు ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
- PPF-SSY Schemes: పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పథకాల వడ్డీ రేట్లలో మార్పులు..? ఈ నెల 30న ప్రకటన..
- Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలు.. జనసేన నేతలకు పవన్ పిలుపు..
- Trump: అమెరికా అత్యంత శక్తివంతంగా తయారైంది.. యూఎన్‌లో ట్రంప్ కీలక ప్రసంగం
తాజావార్తలు
-
Shivaji: పుష్పలో ‘మంగళం శ్రీను’ రోల్ నాదే.. సునీల్ కంటే ముందే ఆ ఛాన్స్ నాకే వచ్చింది!
-
Trump: ఒప్పందం కుదుర్చుకోండి.. లేదంటే నరకానికి పంపిస్తాం.. ప్రపంచ నేతల ముందు ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
-
PPF-SSY Schemes: పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పథకాల వడ్డీ రేట్లలో మార్పులు..? ఈ నెల 30న ప్రకటన..
-
Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలు.. జనసేన నేతలకు పవన్ పిలుపు..
-
Trump: అమెరికా అత్యంత శక్తివంతంగా తయారైంది.. యూఎన్‌లో ట్రంప్ కీలక ప్రసంగం
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!